Tollywood Actress: రకుల్ టు కీర్తి సురేష్ అంతా ఒకే బాటలో..!

హీరోయిన్లు స్లిమ్ గా కనబడడం కోసం ఎన్నో వర్కౌట్లు చేస్తుంటారు.అందుకోసం వాళ్ళు ఉదయం 4గంటలకే లేచి యోగాసనాలు,వర్కౌట్లు వంటివి చేస్తూ ఉంటారు.ఫిట్‌ గా లేకపోతే వాళ్లకి అవకాశాలు వస్తాయన్న గ్యారెంటీ లేదు. అందుకే వాళ్ళు అదే పద్దతిని ఫాలో అవుతారా? అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది హీరోయిన్లు మరీ బక్క చిక్కి పోతున్నారు. ఒకప్పుడు ఈ భామలు కాస్త బొద్దుగా ఉన్నా అవకాశాలు తగ్గేవీమి కాదు. కానీ ఎందుకో ఇప్పుడు మాత్రం జీరో సైజు వచ్చేసారు. వాళ్ళు ఎవరంటే :

1) రకుల్ ప్రీత్ సింగ్ :

కెరీర్ ప్రారంభం నుండీ ఈమె జిమ్ చేస్తూనే ఉంది. కానీ ఈ మధ్య కాలంలో మరీ బక్కచిక్కిపోయింది. బహుశా బాలీవుడ్లో సినిమాలు చేస్తుండడం వలన అనుకుంట..!

2) మెహ్రీన్ :

‘కృష్ణగాడి వీర ప్రేమ గాద’ ‘మహానుభావుడు ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’ వంటి హిట్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు తరువాత కాస్త బొద్దుగా తయారయ్యింది. దాంతో ఈమెకు ఆఫర్లు తగ్గాయనుకుందేమో .. ఇప్పుడు చాలా స్లిమ్ అయిపోయింది.

3) షాలినీ పాండే :

‘అర్జున్ రెడ్డి’ ‘118’ వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ‘నిశ్శబ్దం’ సినిమాలో బాగా సన్నబడింది. ఇప్పుడు మరింత బక్కగా మారిందంటే నమ్మండి.

4) కీర్తి సురేష్ :

స్టార్ హీరోయిన్ కీర్తి కూడా ఇందుకు మినహాయింపు కాదు. మొదట్లో కాస్త బొద్దుగా ఉండేది.. అయినా ఈమెకు అవకాశాలు తగ్గలేదు. కానీ ‘మిస్ ఇండియా’ చిత్రం నుండీ ఈమె చాలా స్లిమ్ అయిపొయింది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus