సినిమాల్లో, రాజకీయాల్లో బయటకు చెబుతున్న విషయం, లోపల జరుగుతున్న విషయం ఒక్కటేనా అంటే ఏమో డౌట్ అనే మాటే అంటుంటారు. ఎందుకంటే అక్కడ జరిగే విషయాలు అన్నీ బయటకు రావు. వచ్చినా వాటిని నమ్మలేం అని అంటుంటారు. ఇప్పుడెందుకు ఈ విషయం అని అనుకుంటున్నారా? పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) సంబంధించి ఒకే రోజు వచ్చిన వార్త, ఫొటోల మధ్య పూర్తి కాంట్రడిక్షన్ కనిపించడమే. ఇంతకీ ఏమైందంటే? ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా నిర్మాత ఎ.ఎం. రత్నం (AM Rathnam) జన్మదినం అంటూ బుధవారం టీమ్ కొన్ని ఫొటోలు రిలీజ్ చేసింది.
అందులో సినిమా టీమ్ అంతా ఉన్నారు. సినిమా కాస్ట్యూమ్స్‌లోనే అందులో నటులు కనిపిస్తున్నారు. దీంతో సినిమా షూటింగ్ అయితే జరుగుతోంది అని అర్థమవుతోంది. అయితే అందులో పవన్ కల్యాణ్ అయితే లేరు. అయితే ఆ ఫొటోలు బయటకు వచ్చేదానికి ముందే మరో విషయం బయటకు వచ్చింది. అదే పవన్ అనారోగ్యం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వల్ప అనారోగ్యంతో ఉన్నారని, స్పాండిలైటిస్ సమస్య కూడా ఉందని చెబుతున్నారు.
ఈ అస్వస్థత కారణంగా గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్ ఆయన హాజరు కాలేదు. అంతగా అనారోగ్యం ఉంటే సినిమా షూటింగ్‌కి టీమ్ ఎందుకు ప్లాన్ చేసుకుంది అనే డౌట్ మొదలైంది. పవన్ ఉన్న సీన్స్ తీద్దామని షెడ్యూల్ మొదలుపెట్టిన టీమ్ ఆయన లేకుండా ఎలా కంటిన్యూ చేశారు అనే చర్చ మొదలైంది. దీంతో అసలు ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్‌ల విషయంలో కన్‌ఫ్యూజ్ ఫుల్లుగా ఉంది అని అనిపిస్తోంది.
ఎందుకంటే ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ చేస్తామని టీమ్ చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే సినిమా అప్పుడు వచ్చేలా లేదు. మరి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మిగిలిన సినిమాలకు లైన్ క్లియర్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది. అవన్నీ తేలాలంటే పవన్ అనారోగ్యం నుండి ముందు కోలుకోవాలి.