ప్రస్తుత తరం నటుల్లో విజయ్ దేవరకొండకి ఉన్నంత స్టార్ డమ్ మరెవరికీ లేదు అనే విషయం అందరూ ఒప్పుకుంటారు. అతనికి కావాల్సిందల్లా ఒక మంచి హిట్టు. ఆ హిట్టు కోసం చాన్నాళ్లుగా వేచి చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. కానీ.. “లైగర్, ఖుషీ, ఫ్యామిలీ స్టార్” సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. దాంతో విజయ్ దేవరకొండను ఎవరో తొక్కేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు అంటూ ఒకటికి రెండుసార్లు ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేసుకుంటున్నారు.
ఆ తొక్కేది కూడా ఇండస్ట్రీ పెద్దలు అంటూ విజయ్ దేవరకొండ పాజిటివ్ ఫ్యాన్ పేజీలు అన్నీ నొక్కి వక్కాణించాయి.
ఇక ఇవాళ ఏకంగా “ఒన్ మ్యాన్ ఎగైన్స్ట్ ఆల్ ఆడ్స్” అని ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఇమ్మీడియట్ గా డిలీట్ చేసారు. అందులో “టార్గెట్ నెగిటివిటీ, బీలో పార్ ప్రమోషన్స్” అని ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. సితార సంస్థ నుండి వచ్చిన సినిమాకి ఇలా బిలో పార్ ప్రమోషన్స్ అంటూ తోక తగిలించడం అనేది కచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది.
ఇదంతా పక్కన పెడితే.. సినిమా కంటెంట్ మీద ధ్యాస పెట్టకుండా టార్గెట్ చేశారు అంటూ వాపోవడం అనేది విజయ్ దేవరకొండ లాంటి స్టార్ యాక్టర్ చేయాల్సిన పని మాత్రం కాదు. ఇకనైనా విజయ్ దేవరకొండ ఇలాంటి జాలి పబ్లిసిటీకి దూరంగా ఉండడం బెటర్. లేకపోతే.. సింపతీని మరీ ఎక్కువగా వాడుకుంటున్నాడు అనే నెగిటివిటీ కూడా క్రియేట్ అవుతుంది.
ఇదంతా పక్కన పెడితే.. విజయ్ దేవరకొండ రాహుల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా అతడి ఇమేజ్ ను కంప్లీట్ గా మార్చేసుందని తెలుస్తోంది. రాయలసీమ యాస, హాలీవుడ్ టెక్నీషియన్లు, భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఆ సినిమా మీద ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత రవికిరణ్ దర్శకత్వంలో చేయబోయే సినిమా కూడా విజయ్ ని చాలా కొత్తగా ప్రెజెంట్ చేయబోతోందని తెలుస్తోంది.