Dhanush: ధనుష్‌ అంటే మన నిర్మాతలకు ఎందుకంత ప్రేమో

వై దిస్‌ కొలవెరి అని చాలా ఏళ్ల క్రితం ధనుష్‌ పాడితే… ప్రేక్షకులు వెర్రివెర్రిగా చూసేశారు. అప్పట్లో సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ పెద్దగా వాడకపోయినా వేలంవెర్రిగా చూసేశారు. అయితే ఇప్పుడు తెలుగు నిర్మాతలు, దర్శకులు అదే రేంజిలో ధనుష్‌ వెంటపడుతున్నారు అనేది లేటెస్ట్‌ టాపిక్‌. ఆ మధ్య ధనుష్‌ తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేస్తున్నాడు అనగానే… ‘ఆ.. ఎప్పటికి మొదలెడతారు’ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఒకటి కాదు ఏకంగా నాలుగు రెడీగా ఉన్నాయి.

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా కొన్ని రోజుల క్రితం సినిమా అనౌన్స్‌ చేశారు. ఏషియన్‌ గ్రూప్‌ వాళ్లు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇది కాకుండా సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ ఓ సినిమా ఉంటుందని వార్తలొస్తున్నాయి. టాలీవుడ్‌ కొత్త ప్రేమకథల దర్శకుడు వెంకీ అట్లూరి ఆ సినిమాను తెరకెక్కిస్తాడట. ఇది కాకుండా… మరో ఇద్దరు నిర్మాతలు చర్చలు జరుపుతున్నారట. అందులో మైత్రీ మూవీ మేకర్స్‌, డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ ఉన్నాయని అంటున్నారు. అయితే ఏది ఎప్పుడనేది తర్వాత తేలుతుంది.

అయితే ఇక్కడే ఓ డౌట్‌. తమిళ మార్కెట్‌లో ధనుష్‌కి ఇప్పుడంత టైమ్‌ బాగోలేదు. ఇటీవల కాలంలో చేసిన సినిమాలు అయితే మోస్తరుగా, లేదంటే డౌట్‌గా మారాయి. మంచి దర్శకులుతో తీసినా… ఆకట్టుకోలేకపోతున్నాడు ధనుష్‌. ఇలాంటి సమయంలో మన నిర్మాతలు అక్కడికి వెళ్లి మరీ ఓకే చేయించుకోవడం ఏంటా అనే ప్రశ్న వినిపిస్తోంది. మల్టీ లింగ్వుల్‌ కాన్సెప్ట్‌లో సినిమా చేయొచ్చనేది ఆలోచన అంటున్నారు. అయితే దానికి మన హీరోలు సరిపోరా… జస్ట్‌ ఆస్కింగ్‌ అంతే.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus