Tollywood Heroes: రీమేక్ రిస్క్.. కాస్త జాగ్రత్త బాబులు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు రీమేక్ సినిమాలపై ఎగబడుతున్నారు. రీమేక్ అనేది ఇప్పటిది కాదు. గోల్డెన్ డేస్ నుంచి ఆనవాయితీగా వస్తున్నదే. సాధారణంగా ఒకప్పుడు హీరోలు వరుస అపజయాలను ఎదుర్కొంటున్న సమయంలో సేఫ్ గా హిట్ కొట్టడం కోసం రీమేక్ సినిమాలు చేసేవారు. కథ బలంతో మినిమమ్ హిట్ అందుకోవచ్చు గాని లోకల్ ఆడియెన్స్ కు కథ కనెక్ట్ అవ్వకపోతే రిస్క్ అని చెప్పవచ్చు. చాలా సందర్భాల్లో రీమేక్ సినిమాలు బెడిసికొట్టాయి.

ఇక వెంకటేష్ లాంటి హీరోలు కెరీర్ బెస్ట్ సినిమాల్లో రీమేక్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఒకప్పుడు జనాలు రీమేక్ అని భేదం చూపేవారు కాదు. కంటెంట్ నచ్చితే కాపీ కొట్టినా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు గ్లోబల్ ఈజ్ లోకల్ అనే ట్రెండ్ నడుస్తోంది కాబట్టి ఎలాంటి రీమేక్ చేసినా కూడా జనాలు అప్పుడే బేధాలు చూపడం స్టార్ట్ చేస్తున్నారు. నారప్ప వెంకటేష్ కు సరైన స్టోరీ అయినప్పటికీ ధనుష్ తో పోల్చడం వలన వాల్యూ లేకుండా పోతోంది.

రీమేక్ ట్రై చేసినా కూడా ఎంతో కొంత భిన్నంగా ట్రై చేస్తే బెటర్ అని చెప్పవచ్చు. గతంలో పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలను తనదైన శైలిలో ప్రజెంట్ చేసి హిట్స్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ తో సిద్ధమవుతున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి.. లూసిఫర్, వేదళం, అలాగే మరొక సినిమాను రీమేక్ చేయాలని అనుకుంటున్నాడు. ఇదే బాటలో మరికొందరు యువ హీరోలు రీమేక్స్ పై ఫోకస్ పెడుతున్నారు. మరి ఆ సినిమాలు ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus