మరోసారి డబ్బింగ్‌ సినిమాలకు సోలో డేట్‌ ఇచ్చేశారుగా!

  • January 19, 2024 / 10:32 AM IST

ఒక పెద్ద సీజన్‌లో ఒక సినిమా వస్తే ఓకే, రెండు సినిమాలు వచ్చినా ఓకే. మూడో సినిమా వచ్చిందంటే ‘ఎందుకు’ అనే ప్రశ్న వస్తుంది. అదే నాలుగో సినిమా కూడా అదే సీజన్‌లో పడితే ఇబ్బందిగా ఉంటుంది. చూసే ప్రేక్షకులకు కాదు కానీ… బాక్సాఫీసుకు, థియేటర్ల సర్దుబాటుకు ఇలా చాలా వాటికి. ఇదంతా ఎందుకు అంటే మొన్న సంక్రాంతికి ఇలా నాలుగు సినిమాలో రెచ్చిపోయిన టాలీవుడ్‌ జనవరి 26ను మాత్రం వదిలేసింది. కావాలంటే మీరే చూడండి రిపబ్లిక్‌ డేకి తెలుగు సినిమాలేవీ లేవు.

రాబోయే వారం లాంగ్ వీకెండ్ కాదా అంటే లాంగ్‌ వీకెండే. ఇలాంటి సమయంలో ఓ తెలుగు సినిమా పడితే అదిరిపోయే వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. కానీ మొత్తం సంక్రాంతి ఓవర్‌ లోడెడ్‌ చేసిన టాలీవుడ్‌ రిపబ్లిక్‌ డేని డబ్బింగ్ సినిమాలకు ఇచ్చేసింది. ధనుష్‌ ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా జనవరి 25న వస్తుండగా, శివకార్తికేయన్‌ సినిమా ‘అయలాన్’ 26న తీసుకొస్తున్నారు. ఇవి కాకుండా హృతిక్ రోషన్ ‘ఫైటర్’ కూడా అప్పుడే వస్తోంది. అయితే దీనికి తెలుగు వెర్షన్‌ లేదు అని అంటున్నారు.

ఇదంతా చూస్తుంటే జనవరి 26 సీజన్‌లో కూడా సంక్రాంతి తెలుగు సినిమాలే ఆడాలి అని ఇండస్ట్రీ జనాలు అనుకున్నారేమో అంటున్నారు. ఎందుకంటే సంక్రాంతి సీజన్‌లో వచ్చిన ‘హను – మాన్‌’, ‘గుంటూరు కారం’, ‘సైంధవ్‌’, ‘నా సామి రంగ’ ఇంకా ఆ డేట్స్‌లో కొన్ని థియేటర్లలో ఉంచే ప్రతిపాదన ఉందట. అందుకే తెలుగు సినిమాలు సంక్రాంతికి లేవు అని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే సీజన్ల వినియోగంలో టాలీవుడ్‌ మరోసారి విఫలమైంది అనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

గతంలో కూడా గంపగుత్తగా సినిమాలు రిలీజ్‌ చేసి ఆ తర్వాత కొన్ని శుక్రవారాలు సినిమాలు లేకుండా అయిపోయింది టాలీవుడ్‌లో. ఇప్పుడు మరోసారి రిపబ్లిక్‌ డే సీజన్‌ కూడా ఇలానే మారిపోయింది. ఇదంతా ఓకే కానీ అసలు (Eagle) ‘ఈగల్‌’కు ఈ డేట్‌ ఎందుకు సజెస్ట్‌ చేయలేదో.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus