సినిమాకు సీక్వెల్ ఉంది, లేదంటే రెండో పార్టు ఉంది అంటూ… ఎండింగ్ టైటిల్స్‌లో వేయడం మనకు బాగా తెలిసిన విషయమే. అలా వేసిన సినిమాలు అన్నీ వచ్చాయా? అంటే లేవనే చెప్పాలి. ఇది ఓ రకం. ఇక్కడ మరో రకం కూడా ఉన్నాయి. అదే తొలి భాగం సినిమా ప్రచారంలో రెండో పార్టు గురించి ఎవరు అడక్కపోయినా సినిమా టీమ్ ఊరకనే చెప్పేస్తుంటాయి. దీంతో ఈ సినిమా మీద బాగా నమ్మకం ఉందేమో అని జనాలు అనుకోవచ్చు అనే టాక్టిక్స్ ఉన్నాయి అంటారు.
ఇప్పుడు ఆ రెండో పార్టు సంగతులు ఎందుకు అనుకుంటున్నారా? ఎప్పటిలాగే దీనికి ఓ కారణం ఉంది. ఈ శుక్రవారం సినిమాలు రిలీజ్ అవ్వడంతోనే ఈ టాపిక్ గురించి చర్చ మొదలైంది. ఈ శుక్రవారం భారీ అంచనాలతో రామ్ – బోయపాటి శ్రీను ‘స్కంద’, శ్రీకాంత్ అడ్డాల ‘పెదకాపు 1’ వచ్చాయి. రెండో సినిమాకు రెండో పార్టు ఉందని గతంలోనే చెప్పేశారు. సినిమా పేరుతోనే క్లారిటీ ఇచ్చేశారు కూడా. అయితే తొలి సినిమా అంటే ‘స్కంద’కు రెండో పార్టు ఉందని క్లైమాక్స్‌లో చెప్పారు.
ఇలాంటి సినిమాలకు రెండు పార్టులు ఉండటం పెద్ద విషయమేమీ కాదు. అయితే సరైన కథ లేదు అంటూ విమర్శలు వస్తున్న ‘స్కంద’కు, సరైన విజయం అందుకోలేకపోయిన ‘పెదకాపు 1’కి సీక్వెల్స్ ఎందుకు అనే చర్చ నడుస్తోంది ఇప్పుడు టాలీవుడ్ జనాల మధ్యలో, అలాగే సోషల్ మీడియాలో కూడా. ‘స్కంద’ లాంటి రొడ్డ కొట్టుడు కమర్షియల్ సినిమాకు రెండో పార్టు అంటే ఇలానే మాస్ సన్నివేశాలు గుదిగుచ్చి వదిలేయడమే కదా అంటూ సన్నాయి నొక్కులు కూడా నొక్కుతున్నారు.
దీంతో గతంలోలాగే ఈ సినిమాల (Movies) సీక్వెల్స్ కాలంలో కలసిపోతాయా అనే డిస్కషన్ నడుస్తోంది. ఇటీవల కాలంలో అయితే ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా సీక్వెల్ ఇలానే ఆగిపోయింది. ‘బింబిసార 2’ సంగతి అయితే ఏమీ తెలియడం లేదు. చూద్దాం సెప్టెంబరు నెలాఖరు సినిమాలకు రెండో పార్టు ఉంటుందో లేదో.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !