‘వైఫ్ ఐ’ ట్రైలర్ రివ్యూ.. మళ్ళీ అదే చీప్ ట్రిక్ !

బాలీవుడ్ స్టైల్ లో మన సినిమాల్లో కూడా బోల్డ్ నెస్ పెరిగింది అనడంలో సందేహం లేదు. ఇక్క బోల్డ్ అంటే కుర్ర కారుని హీటెక్కించే హాట్ సీన్లు, ముద్దులు మాత్రమే కాదు ఒక డేరింగ్ కాన్సెప్ట్ ను ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేయడం. బోల్డ్ లో యువత చేసే పొరపాట్లు చూపించడం.. వంటివి ప్రధానంగా వస్తాయి. కానీ ఇప్పటి మూవీ మేకర్స్ బోల్డ్ అంటే మితిమీరిన శృంగారపు సన్నివేశాల్ని పెట్టేసి కుర్రకారుని టెంప్ట్ చేయడమే ప్రధాన టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ కోవలో వచ్చిందే ‘ఏడు చేపల కథ’ సినిమా..! యూట్యూబ్ లో సెన్సార్ లేదు కదా అని భయంకరమైన హాట్ సీన్లు పెట్టేసి ప్రేక్షకులని థియేటర్ కి రప్పించారు. కానీ అవన్నీ చీప్ ట్రిక్స్ అని వారు తేల్చేసారు. అయినప్పటికీ సినిమాకి కలెక్షన్లు వచ్చేయడంతో బ్రేక్ ఈవెన్ అయిపొయింది.

కానీ అదే ట్రిక్ మళ్ళీ ప్లే చెయ్యాలని.. ‘ఏడు చేపల కథ’ హీరో అభిషేక్ (టెంప్ట్ రవి) అనుకుంటున్నాడేమో..! ఈసారి కూడా అదే చేప ట్రిక్.. సారి సారి చీప్ ట్రిక్ ప్లే చేస్తున్నాడు. విషయం ఏంటంటే.. అభిషేక్ నటించిన ‘వైఫ్ ఐ’ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ సినిమాలో గుంజన్.. ఫిదా గిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీ.ఎస్.ఎస్.పీ కళ్యాణ్ ఈ చిత్రానికి దర్శకుడు. టీజర్ ఆరంభంలో తన భార్య మిస్సింగ్ అంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇచ్చే వ్యక్తిగా అభిషేక్ కనిపించాడు. కాసేపు ఆ డ్రామా సాగింది కానీ తరువాత మాత్రం.. ‘ఏడు చేపల కథ’ స్టైల్ లోనే మితిమీరిన హాట్ సీన్లు పెట్టేసి టెంప్ట్ చేసే చేప ట్రిక్స్ ప్లే చేసినట్టున్నారు. కానీ ‘ప్రతీసారి టెంప్ట్ అవ్వం రవి’ అంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తుండడం విశేషం. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.


“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus