కుమార్‌ సాయి సర్‌ప్రైజ్‌ చేశాడా… సర్‌ప్రైజ్‌ అయ్యాడా?

బిగ్‌బాస్‌ ఇంట్లోకి వైల్డ్‌ కార్డ్‌గా కుమార్‌ సాయి అలియాస్‌ సాయి కుమార్‌ పంపన వచ్చిన విషయం తెలిసిందే. అతనిని ఇంట్లోకి ఎలా పంపిస్తారనే విషయంలో నిన్ననే క్లారిటీ కూడా వచ్చేసింది. ఇంట్లో ఉన్న ఓ డోర్‌ నుంచి దొంగలా నక్కుతూ వచ్చేశాడు. అప్పటికి అందరూ నిద్రపోతున్నారు. హాల్‌లో ఉన్న సోఫాలో వచ్చి నిద్రపోయి ముసుగేసేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ రోజు తెలుస్తుంది.

స్పాంటేనిటీ ఉన్న కమేడియన్‌గా కుమార్‌ సాయికి పేరు. దానినే చిన్న ప్రోమోలో కూడా చూపించాడు. ‘బిగ్‌బాస్‌ సర్‌ప్రైజ్‌ బాగుంది కానీ… ఉదయాన్నే నన్ను చూసి ఏ దొంగో అనుకొని నన్ను కొడితే నాకు రిటర్న్‌ సర్‌ప్రైజ్‌ అవుతుంది’అని పంచ్‌ వేశాడు. మరి కుమార్‌ సాయి పంచ్‌ నిజమవుతుందా… లేక హౌస్‌ మేట్స్‌ కేవలం ఆశ్చర్యపోయి నవ్వేసుకుంటారా అనేది చూడాలి. అయితే ప్రోమోలో ఓ విషయం గమనించొచ్చు. మంచం మీద కాకుండా ఒకరు నేల మీద నిద్ర పోతున్నారు. అదెవరో తెలియాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus