రెండు భాగాలతో మెప్పించడం ఈ స్టార్ హీరోలకు /సాధ్యమేనా?

బాహుబలి, కేజీఎఫ్ సిరీస్ సినిమాలు రెండు భాగాలుగా తెరకెక్కినా భారీ విజయాలను సొంతం చేసుకుని దర్శకులకు, నిర్మాతలకు మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు మంచి లాభాలను అందించాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు భాగాల ట్రెండ్ కొనసాగుతుందనే సంగతి తెలిసిందే. తెలుగులో తెరకెక్కుతున్న సినిమాలలో చాలా సినిమాలు రెండు భాగాలుగా తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలలో ఎన్ని సినిమాలు బాహుబలి, కేజీఎఫ్ మ్యాజిక్ ను రిపీట్ చేస్తాయో చూడాల్సి ఉంది. కొన్ని సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటనలు రాకపోయినా ఆ సినిమాలు రెండు భాగాలుగా తెరకెక్కుతున్నాయని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

సలార్ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ కానుంది. పుష్ప1 ఇప్పటికే విడుదలై సంచలనాలు సృష్టించగా పుష్ప2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పుష్ప2 సినిమా టార్గెట్ భారీగా ఉండగా ఈ సినిమాకు ఆ రేంజ్ లోనే కలెక్షన్లు వస్తాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో పెదకాపు అనే మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. సత్యదేవ్ గరుడ మూవీ కూడా రెండు భాగాలుగా తెరకెక్కనుందని భోగట్టా.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ, బాలయ్య శివరాజ్ కుమార్ కాంబో మూవీ, తేజ డైరెక్షన్ లో తెరకెక్కనున్న రాక్షస రాజు మూవీ కూడా రెండు భాగాలుగా తెరకెక్కనున్నట్టు వార్తలు వినిపిస్తుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సినిమాలు అన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమాలు సక్సెస్ సాధిస్తే రెండు భాగాలుగా మరిన్ని సినిమాలు తెరకెక్కే ఛాన్స్ ఉంది. రాజమౌళి తన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్రతి సినిమాను రెండు లేదా మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus