ట్యాలెంటెడ్ హీరోకి 2020 అయినా కలిసొస్తుందా..!

పాపం ఎంతో ఆకాస్తపడుతున్నప్పటికీ హిట్ కొట్టలేకపోతున్నాడు ఓ ట్యాలెంటెడ్ హీరో. అతను ఎవరో కాదు మన డైలాగ్ కింగ్ సాయికుమార్ గారి అబ్బాయి ఆది. హీరోగా ఎంట్రీ ఇవ్వడమే.. ‘ప్రేమకావాలి’ ‘లవ్ లీ’ వంటి రెండు హిట్లు అందుకున్న ఆది ఇప్పటివరకూ మరో హిట్ అందుకోలేకపోయాడు. మధ్యలో ‘గాలిపటం’ ‘శమంతకమణి’ ‘నెక్స్ట్ నువ్వే’ వంటి చిత్రాలతో పర్వాలేదనిపించినా.. కమర్షియల్ సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు. ఇక 2019 లో ‘బుర్రకథ’ ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ ‘జోడి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులని పలకరించిన ఆది ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయాడు.

ఇటీవల తన పుట్టినరోజు నాడు కూడా మరో 3 సినిమాల్ని అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వాటిలో శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘శశి’ ఒకటి కాగా… జిబి.క్రిష్ణ డైరెక్షన్లో తెరకెక్కనున్న చిత్రం మరొకటి. ఈ చిత్రాన్ని మహంకాళి దివాకర్ నిర్మిస్తున్నాడు.మరో చిత్రం నూతన దర్శకుడు శివ శంకర్ దేవ్ డైరెక్షన్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మరుధూరి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించబోతుంది. ఈ మూడు చిత్రాలు కూడా 2020లోనే విడుదల కాబోతున్నాయి. మరి ఈసారైనా హిట్ అందుకుంటాడేమో చూడాలి..!

రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus