Allu Arjun, Ram Charan, Jr NTR: ఆ విషయంలో బన్నీ మారాల్సిందేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. తమ సినిమాలను తెలుగు, హిందీ భాషలతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా విడుదల చేయడానికి స్టార్ హీరోలు సిద్ధమవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్, చరణ్ సొంత గొంతును వినిపించిన సంగతి తెలిసిందే. అయితే బన్నీ మాత్రం పుష్ప సినిమాకు డబ్బింగ్ చెప్పడానికి ధైర్యం చేయలేదు. పుష్ప ది రైజ్ హిందీలో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది.

పుష్ప ది రైజ్ ప్రపంచవ్యాప్తంగా 280 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించడం గమనార్హం. బన్నీ తర్వాత సినిమాలకు అయినా ఇతర భాషల్లో డబ్బింగ్ చెప్పుకుంటే బాగుంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. ఎన్టీఆర్, చరణ్ ను బన్నీ ఫాలో కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి బన్నీ డబ్బింగ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్, చరణ్ డబ్బింగ్ కు బాలీవుడ్ లో ప్రశంసలు దక్కుతున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 14 భాషలలో ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కానుంది.

మలయాళం మినహా అన్ని భాషల్లో చరణ్, తారక్ డబ్బింగ్ చెప్పుకున్నారు. పుష్ప ది రూల్ కు బన్నీ డబ్బింగ్ చెప్పుకుంటారేమో చూడాల్సి ఉంది. అఖండ, పుష్ప సక్సెస్ సాధించగా ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. దేశంలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఆర్ఆర్ఆర్ రిలీజవుతుండటం గమనార్హం. సంక్రాంతి సీజన్ ను నమ్ముకుని రాజమౌళి తొలిసారి సంక్రాంతికి తన సినిమాను విడుదల చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ బాహుబలి2 సినిమాను మించి విజయం సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ 1,000 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధిస్తుందేమో చూడాలి. ఆర్ఆర్ఆర్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం. ఆర్ఆర్ఆర్ ఫలితం విషయంలో తారక్, చరణ్ నమ్మకంతో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ సాధిస్తే తెలుగులో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కే ఛాన్స్ ఉంటుంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus