దాదాపు మూడేళ్లవుతుంది అనుకుంటా… ‘ఐకాన్’ అనౌన్స్‌మెంట్ జరిగి. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకుడిగా ఈ సినిమా ఉంటుంది అంటూ టైటిల్ పోస్టర్‌ను 2019లో రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో బైక్ మీద ఓ కుర్రాడు వెళ్తున్నట్లు చూపించారు. అయితే కథ విషయంలో అభ్యంతరాలతో సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ఈలోగా ‘వకీల్‌సాబ్’ పనుల్లో వేణు శ్రీరామ్ బిజీ అయిపోయాడు. దీంతో ‘ఐకాన్’ ఇక లేదులే అనుకున్నారంతా. అయితే ‘వకీల్‌సాబ్’ ఫలితం మీద ‘ఐకాన్’ ఆధారపడి ఉందంటూ పుకార్లు వచ్చాయి. ఇప్పుడు ‘వకీల్‌సాబ్’ ఫలితం అద్భుతం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి అల్లు అర్జున్ ఇప్పటికైనా ‘ఐకాన్’ చేస్తాడా? ఇప్పుడిదే ప్రశ్న.
‘ఐకాన్’ మొదలుపెట్టినప్పుడు బజ్ మంచిగుండే. ‘ఎంసీఏ’తో ఫర్వాలేదనిపించే హిట్ అందుకున్న వేణు శ్రీరామ్… ‘ఐకాన్’తో మాస్ డైరక్టర్‌గా మారుతాడు అని అందరూ అనుకున్నారు. అయితే అల్లు అర్జున్ దీనిని పక్కనపెట్టి వేరే సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. మరోవైపు వేణు శ్రీరామ్ కథకు తుది మెరుగులు అద్దుతూ వచ్చాడు. అయినా ఎక్కడో చిన్న అనుమానం… అల్లు అర్జున్ ‘ఐకాన్’ చేస్తాడా అని. అయితే ఇటీవల దిల్ రాజు మాట్లాడుతూ ‘ఐకాన్’ విషయంలో అల్లు అర్జున్‌తో టచ్‌లో ఉన్నామని… సినిమా ఉంటుందని చెప్పాడు. దీంతో మళ్లీ ఈ ముచ్చట్లు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే ‘పుష్ప’ ఒక్కటే. ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా ఉంటుందని వార్తలొచ్చినా… తర్వాత బన్ని వాసు ‘ఏమో ఉండొచ్చు.. ఉంటే మంచిది’ అంటూ అటుఇటుగా చెప్పాడు. దీంతో ‘పుష్ప’ తర్వాత ఏంటి అనేది తెలియాలి. దీంతో అది ‘ఐకాన్’ అవ్వొచ్చనే వార్తలు వస్తున్నాయి. మాస్ మేనరిజం, ఎలివేషన్ సీన్స్ తీయడంతో వేణు శ్రీరామ్ టాలెంట్ ఏంటో ‘వకీల్‌సాబ్’ చూపించింది. సో డౌట్ లేకుండా బన్నీ ఒకే చెప్పేస్తాడేమో.
Most Recommended Video
వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!