క్లారిటీ ఇవ్వబోయి… కన్‌ఫ్యూజ్‌ క్రియేట్‌ చేసిన బన్ని వాసు

మొన్నామధ్య గీతా ఆర్ట్స్‌ ఆఫీసు దగ్గర ప్రశాంత్‌ నీల్‌ కనిపించాడు. దానికి సంబంధించిన కొన్ని ఫొటోలు అంతర్జాలంలో హల్‌చల్‌ చేశాయి. దీంతో అల్లు అర్జున్‌ – ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు. అప్పుడే కొన్ని ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్లు వచ్చేశాయి. కొరటాల శివ సినిమా అయ్యాక… ఈ సినిమా ఉండొచ్చు అనే పుకార్లు వచ్చేశాయి. ఈలోపు ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌’ పూర్తి చేసుకొని వచ్చేస్తాడని అని కూడా అనేశారు. అయితే ఇవన్నీ నిజమయ్యేలా కనిపించడం లేదు.

గీతా ఆర్ట్స్‌కు బాగా దగ్గరైన బన్ని వాసు చెప్పిన మాటలే ఈ కొత్త మాటలకు కారణం. అల్లు అరవింద్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే ప్రశాంత్ నీల్ గీతా ఆర్ట్స్‌ ఆఫీసుకు వచ్చాడని బన్ని వాసు చెప్పాడు. అలా అని అల్లు అర్జున్‌- ప్రశాంత్‌ నీల్‌ సినిమా ఉంటుందా? అంటే ‘ఉంటే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నాం’ అని చెప్పుకొచ్చాడు బన్ని వాసు. అయితే అల్లు అరవింద్‌ – ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో మాత్రం సినిమా ఉంటుందని కచ్చితంగా చెప్పుకొచ్చాడు.

దీంతో టాలీవుడ్‌లో కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి. గీతా ఆర్ట్స్‌లో సినిమా అంటే అల్లు అర్జున్‌తోనే తీయాలని లేదు. కానీ అంత పెద్ద అవకాశాన్ని అల్లు అరవింద్‌.. బన్నికి ఇవ్వకుండా వేరే హీరోకు ఇస్తాడా? అనేది అర్థం కావడం లేదు. మెగా ఫ్యామిలీలో అంత మాస్‌ ఇమేజ్‌ ఉన్న హీరోలు చాలామందే ఉన్నారు. వాళ్లతో ఎవరితోనైనా ప్రశాంత్‌ నీల్‌ సినిమా ఉంటుందా అనే ప్రశ్నలూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏ మెగాహీరో కూడా అంత ఖాళీగా లేరు. దీంతో ఈ కన్‌ఫ్యూజ్‌ క్రియేట్‌ చేసిన బన్ని వాసునే… సమాధానం చెప్పాలి.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus