Animal OTT: ‘యానిమల్‌’ రిలీజ్‌ ఆపండంటూ కోర్టుకెక్కిన నిర్మాత… ఏమైందంటే?

  • January 17, 2024 / 02:09 PM IST

‘యానిమల్‌’ సినిమా థియేటర్లలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసినవాళ్ల కంటే ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న వాళ్లే ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే థియేటర్‌ రిలీజ్‌ ముందు ఈ సినిమా మీద నమ్మకం ఉంటే… ఇప్పుడు ఆ సినిమా మీద జనాల్లో చాలా పెద్ద నమ్మకం ఉంది. దాంతోపాటు థియేటర్‌లో లేని చాలా ఆసక్తికరమైన సీన్స్‌ ఇప్పుడు ఓటీటీ సినిమాలో ఉంటాయి అని వార్తలొచ్చాయి. అయితే అలాంటి వెయిట్‌ చేసేవాళ్లకు ఓ బ్యాడ్‌ న్యూస్‌.

‘యానిమల్’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ విషయంలో ఓ మెలిక పడింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఆపేయమంటూ ఓ వ్యక్తి కోర్టుకు ఎక్కారు. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాలో భాగమైన ఓ వ్యక్తే ఈ పని చేశారు. సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన సినీ వన్ స్డూడియోస్ ఈ మేరకు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. సినిమా ప్రధాన నిర్మాణ సంస్థ టి సిరీస్ తమతో కుదుర్చుకున్న అగ్రిమెంట్‌కు తగ్గట్టు వ్యవహరించడం లేదని పిటిషన్‌దారు కోర్టును ఆశ్రయించారు.

‘యానిమల్’ సినిమాలో తమకు 35 శాతం ప్రాఫిట్ షేర్, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ తమ సినీ వన్ స్డూడియోస్‌కు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ప్రాఫిట్ షేరింగ్ విషయంలో టి సిరీస్ ఒప్పందాన్ని గౌరవించడం లేదని తెలిపారు. అలాగే ‘యానిమల్’ సినిమాకు సీక్వెల్‌గా ‘యానిమల్ పార్క్’ ప్రకటించడంపై కూడా సినీ వన్ స్టూడియోస్ అభ్యంతరం తెలిపింది. ఈ ప్రాజెక్టు విషయంలో తమతో సంప్రదింపులు జరపలేదని తెలిపారు.

అయితే ‘యానిమల్’ (Animal) సినిమా హక్కుల్ని సినీ వన్ స్టూడియోస్ సంస్థ రూ.2.2 కోట్లకు వదులుకుందని టి సిరీస్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఈ ఒప్పందంపై వివరణ ఇవ్వాలని సినీ వన్ స్టూడియోస్ సంస్థను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 18కు వాయిదా వేసింది. దీంతో మరి అనుకున్నట్లుగా జనవరి 26న ఈ సినిమా ఓటీటీకి వస్తుందా అనేది డౌట్‌ వినిపిస్తోంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus