ఏ హీరోయిన్ అయినా తాను నటించే సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఆమె కెరీర్ ను ఆ సినిమా సక్సెస్ డిసైడ్ చేస్తుంది. అందుకే వేలంతలో ప్రమోట్ చేస్తారు. రీసెంట్ గా అనుపమ తాను ప్రధాన పాత్రలో రూపొందిన “పరదా” సినిమాని ఏకంగా రోడ్ల మీదకి వచ్చి మరీ ప్రమోట్ చేసింది. ఒక హీరోయిన్ సినిమా ప్రమోషన్ కోసం రోడ్ షో చేసిన దాఖలాలు ఈమధ్యకాలంలో లేవనే చెప్పాలి. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీస స్థాయి కలెక్షన్స్ సాధించకపోవడంతో చిత్రబృందంతోపాటు అనుపమ కూడా దిగ్భ్రాంతికి గురయ్యింది.
అయినప్పటికీ.. ఏమాత్రం నిరుత్సాహం చూపకుండా, ఆరోగ్యం బాగోకపోయినా “కిష్కింధపురి” ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చింది, కామన్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూల వరకూ ఇస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే.. “పరదా” టైమ్ లో చాలా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చింది కాబట్టి, దాని గురించి ఏమైనా అడుగుతారని ఎవాయిడ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఈ శుక్రవారం విడుదలవుతున్న “కిష్కింధపురి” సినిమా హిట్ అయితే అనుపమ తీసుకోగలుగుతుందా లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. “కిష్కింధపురి” కంటే ఎక్కువగా ఆమె “పరదా” సినిమాని నమ్మింది. అదేమో కమర్షియల్ గా డిజాస్టర్ గా నిలిచింది. మరి ఈ సినిమా విజయాన్ని ఆమె ఆస్వాదించగలుగుతుందో లేదో చూడాలి.
ఓవరాల్ గా సక్సెస్ ఇంపార్టెంట్ అయినప్పటికీ.. నమ్మిన ప్రొడక్ట్ వర్కవుట్ అవ్వకుండా, రెగ్యులర్ ఫార్మాట్ సినిమా హిట్ అయితే.. భవిష్యత్తులో కంటెంట్ లేదా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించరు. మరి అనుపమ ఈ విషయంలో ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ఇకపోతే.. అనుపమకు తెలుగులో మళ్లీ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయని, అనుపమే దేనికీ ఓకే చెప్పడం లేదని తెలుస్తోంది.