ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల రేట్లపై గత కొద్ది రోజులుగా చర్చ, రచ్చ నడుస్తూనే ఉంది. సినిమా పరిశ్రమ నుండి అతికొద్దిమంది మాట్లాడారు. ప్రభుత్వం నుండి అయితే వీలైనంత మంది మాట్లాడారు. అందులో అందరినీ ఆకర్షించి, కాస్త వివరాలు తెలియజేసిన చర్చ రామ్‌గోపాల్ వర్మ vs మంత్రి పేర్ని నాని. సినిమా టికెట్ల ధరల అంశంపై వీరిద్దరూ ట్విటర్ వేదికగా కొన్ని రోజులు ట్వీట్ల యుద్ధం నడిచింది. ఇటు వర్మ చెప్పడం, అటు నాని రిప్లై ఇవ్వడం సాగాయి. అయితే త్వరలో ఏపీ ప్రభుత్వంతో వర్మ చర్చలు జరపనున్నారు. అయితే ఇక్కడ ఒకటే డౌట్ వర్మ మాటల్ని ఏపీ ప్రభుత్వం పట్టించుకుంటుందా?
ఈ డౌట్ ఎందుకొచ్చింది అనుకుంటున్నారా.. దానికో కారణం. సినిమా పరిశ్రమ విషయంలో, టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఇన్నాళ్లూ పాటించిన వైఖరి చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. ప్రభుత్వం ఆలోచనల్ని విమర్శిస్తే ఎవరికైనా గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ఇటు పరిశ్రమ నుండి ఆ ప్రశ్నించే వ్యక్తికి సపోర్టు ఉండటం లేదు. పవన్ కల్యాణ్, నాని లాంటి వాళ్లను గుర్తుకు తెచ్చుకుంటే మీకే విషయం అర్థమైపోతుంది. ఇప్పుడు వర్మకు అలాంటి సపోర్టు రాదు, వచ్చినా ఆయన తీసుకోడు కూడా. ఆయన తత్వం అలాంటిది.
వర్మ ట్వీట్ చేసిన దాని ప్రకారం పదో తేదీన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని అండ్ కో.ను ఆర్జీవీ కలవనున్నారు. అయితే నిజంగా ఈ మీటింగ్ అవుతుందా? వర్మ చెప్పే పాయింట్లకు ఏపీ ప్రభుత్వం ఓకే అంటుందా అనేది చూడాలి. ఎందుకంటే వర్మ చెప్పే విషయాలన్నీ వినడానికి, చదవడానికి ఓకే. కానీ పరిశ్రమ పెద్దలు వాటికి ఊ కొట్టడం లేదు. అగ్ర హీరో నాగార్జునే టికెట్ రేట్ల గురించి పెద్దగా మాట్లాడలేదు. చిరంజీవి పక్కకు వెళ్లిపోయారు. మోహన్‌బాబు, మంచు విష్ణు సంగతి సరేసరి.
ఇలాంటి సమయంలో ఆర్జీవీ మాటలు విని, ప్రభుత్వం ఆలోచన మారి పరిశ్రమకు సాయం చేస్తుందా? ఒకవేళ ప్రభుత్వం తరఫున కొన్ని ప్రశ్నలు వస్తే వర్మ వాటిని ఎవరికి చెబుతారు? వర్మ ఆ స్థాయి రెస్పాన్స్ ఎవరు ఇస్తారు అనేది చూడాలి. మరోవైపు వర్మ ఇంకా ట్వీట్ల దాడి ఆపలేదు. ఈ రోజు థీమ్ పార్క్‌లు, సినిమాలను కంపేర్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. కలుద్దాం అని మంత్రి అపాయింట్‌మెంట్ ఇచ్చాక ఇలాంటి ట్వీట్ చేసి వర్మ పరిస్థితి సంక్లిష్టం చేసుకున్నారా? ఏమో పదో తేదీ తెలుస్తుంది.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!