Venkatesh: ‘నారప్ప’ చూశారు…. ‘దృశ్యం2’ చూస్తారా?

వేరే భాషలో హిట్‌ అయిన సినిమాను తెలుగులోకి తీసుకొచ్చి హిట్లు కొట్టడం మనకు కొత్తేమీ కాదు. చాలా ఏళ్లుగా ఈ విధానం సాగుతూనే ఉంది. అయితే ఓటీటీలు వచ్చాక ఇలాంటి పరిస్థితి కాస్త ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఓటీటీలతో ఇతర భాషా చిత్రాలను మన వాళ్లు ఎప్పటికప్పుడు సబ్‌టైటిల్స్‌తో చూసేస్తున్నారు. అలాంటి సినిమాను తెలుగులోకి తీసుకొస్తే… ఆదరణ దక్కుతుందా? డౌటే అనిపిస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ టైమ్‌లో మలయాళంలో ‘దృశ్యం 2’ను విడుదల చేశారు.

అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమ్‌ అయ్యింది. భాషలకు అతీతంగా ఆ సినిమా అందరి అభిమానాలను చూరగొంది. అలాంటి కాన్సెప్ట్‌లకు భాషతో సంబంధం ఉండదు అంటుంటారు. ఇప్పుడు ఆ సినిమా తెలుగులో అదే అమెజాన్‌ ప్రైమ్‌ విడుదల చేస్తోంది. ఓటీటీ వ్యూయర్స్‌కి ఇందులో కొత్తదనం ఏమీ ఉండదు. అలాంటప్పుడు ఎందుకు విడుదల చేస్తున్నట్లో. పోనీలే కొత్త దర్శకుడు, కొత్త కాస్టింగ్‌, స్క్రీన్‌ప్లేలో మార్పులు లాంటివి ఉంటే… ఏమైనా కొత్తదనం ఉండొచ్చు అని ఆశించొచ్చు.

వెంకటేశ్‌ రీమేక్‌ సినిమాల్లో అలాంటివి మన ఎక్స్‌పెక్ట్ చేయడం అత్యాశే. అక్కడ ఏముందో యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా దింపేస్తుంటారు వెంకీ మామ. కాబట్టి చూసిన సినిమాను లాంగ్వేజ్‌ ఆప్షన్‌ మార్చినట్లు, ముఖాలు మారి చూస్తాం. అయితే వెంకీ తన పర్‌ఫార్మెన్స్‌తో సినిమాకు కొత్త కలర్‌ ఇస్తారేమో ఈ నెల 25న చూడాలి.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus