Shiva Rajkumar: బాలయ్య, తమ్ముడు శివ రాజ్ కుమార్ కోరిక తీరుస్తాడా?

నటరత్న నందమూరి తారక రామరావు.. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్.. ఒకరు తెలుగు చలనచిత్ర చరిత్రలో లెజెండ్ అయితే, మరొకరు కన్నడ చిత్రసీమలో లెజెండ్.. ఇద్దరి మధ్య, రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధముండేది. వారి తర్వాత కేవలం నట వారసులుగానే కాకుండా తండ్రుల అనుబంధాన్ని కూడా కొనసాగిస్తున్నారు నటసింహ బాలకృష్ణ.. కరునాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్. శివన్నను బాలయ్య తమ్ముడిలా భావిస్తారు. పలుమార్లు ఆయన నటించిన కన్నడ సినిమా ఫంక్షన్లకు ముఖ్య అతిథిగా బాలయ్య హాజరయ్యాడు.

అలాగే లేపాక్షి ఉత్సవాలకు కూడా శివన్నను ఆహ్వానించారు బాలయ్య.. ఇక శివ రాజ్ కుమార్ ‘వేద’ చిత్రం తెలుగులో విడుదలవుతుండగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలయ్య అతిథిగా విచ్చేసి మూవీ టీంకి విషెస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ ఏవీ చూడగానే భావోద్వేగానికి గురై కంటతడి పెట్టిన శివన్నను అన్నలా ఓదార్చారు బాలయ్య. తన ప్రసంగంలో ఎన్టీఆర్ – రాజ్ కుమార్ మధ్య అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. సినీ వారసత్వాన్ని కొనసాగించడం అనేది బాధ్యతని చెప్పారు.

పునీత్ రాజ్ కుమార్ గురించి కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఇక శివన్న మాట్లాడుతూ.. బాలయ్యతో పరిచయం గురించి చెప్పుకొచ్చారు. ఇంతకుముందు తన ఫంక్షన్లకు వచ్చి బాలయ్య బ్లెస్ చేశారని.. కానీ ఇప్పటి పరిస్థితిలో పిలవగానే వచ్చారని.. తారక రత్నను బెంగుళూరు ఆసుపత్రిలో చూశానని.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. అలాగే ఒక్క పాటతో సరిపోదు.. బాలయ్యతో పూర్తి సినిమా చేయాలి అనే కోరికను బయట పెట్టారు. దీంతో.. అలాగే అన్నట్టు బాలయ్య తలూపారు.

నటసింహ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లో ‘సింగముపై లఘించెను బాలుడు పేరు శాతకర్ణి’ అనే పాటలో కనిపించారు శివ రాజ్ కుమార్. వీరి తర్వాత జూనియర్ ఎన్టీఆర్, పునీత్ రాజ్ కుమార్‌ల మధ్య కూడా మంచి అనుబంధముంది. పునీత ‘చక్రవ్యూహ’ సినిమాలో తారక్ ‘గెలయా’ సాంగ్ పాడాడు. అలాగే ఇటీవల ‘కర్ణాటక రాజ్యోత్సవ’ కార్యక్రమంలోనూ పాల్గొన్నాడు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus