Bichagadu2: ఆ రేంజ్ లో బిచ్చగాడు2 కలెక్షన్లను సాధిస్తుందా?

పెట్టిన పెట్టుబడికి 10 నుంచి 20 రెట్లు ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధిస్తే ఆ సినిమాలను సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా ఇండస్ట్రీ హిట్ గా పరిగణిస్తారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన డబ్బింగ్ సినిమాలలో బిచ్చగాడు సినిమా ఒకటి. మొదట ఈ సినిమా టైటిల్ ను చూసి నవ్వుకున్న జనాలు ఈ సినిమాను థియేటర్లలో చూసిన తర్వాత తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఈ సినిమా గొప్ప కాన్సెప్ట్ తో తెరకెక్కిందని మౌత్ టాక్ రావడంతో కలెక్షన్లు పెరిగాయి.

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని విజయ్ ఆంటోని ఈ సినిమాతో ఆడియన్స్ కు దగ్గరయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో సృష్టించిన సంచలనాలు అప్పట్లో హాట్ టాపిక్ అయింది. తమిళంతో పోల్చి చూస్తే తెలుగులోనే ఈ సినిమా మరింత ఎక్కువగా సక్సెస్ సాధించింది. బుల్లితెరపై రేటింగ్స్ విషయంలో ఈ సినిమా రికార్డులు చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ప్రేక్షకుల హృదయాలను కదిలించిన ఈ సినిమాకు సీక్వెల్ గా బిచ్చగాడు2 తెరకెక్కింది.

బిచ్చగాడు మ్యాజిక్ ను బిచ్చగాడు2 సినిమా రిపీట్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది. కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే ఈ సినిమా సక్సెస్ సాధించడం కష్టమేం కాదని ప్రేక్షకుల్లో అభిప్రాయం ఉంది. బిచ్చగాడు2 శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టా మా ఛానల్ సొంతం చేసుకోగా డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది.

2023 సమ్మర్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే బిచ్చగాడు రేంజ్ లో బిచ్చగాడు2 సినిమాకు కలెక్షన్లు వస్తాయో లేదో చూడాలి. మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కితే సీక్వెల్ సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తాయని ఇప్పటికే చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. బిచ్చగాడు2 సినిమా కూడా ఆ జాబితాలో చేరాలని విజయ్ ఆంటోని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus