Boyapati Srinu, Balayya: స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్య మూవీ విషయంలో అలా చేస్తారా?

బాలయ్య బోయపాటి శ్రీను కాంబో బ్లాక్ బస్టర్ కాంబో కాగా ఈ కాంబోలో మరో సినిమా ఫిక్స్ అయింది. ఈ సినిమా అఖండకు సీక్వెల్ అని కొన్ని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా లెజెండ్ మూవీకి సీక్వెల్ అని మరికొన్ని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం లెజెండ్ కు సీక్వెల్ అయినా అఖండకు సీక్వెల్ అయినా పరవాలేదని చెబుతున్నారు. అయితే బాలయ్య బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన ప్రతి సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించారు.

అయితే సీక్వెల్ లో అయినా ఒకే పాత్రతో తెరకెక్కిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఒక పాత్రనే పవర్ ఫుల్ గా చూపించాలని ఫుల్ లెంగ్త్ రోల్ ను అదే విధంగా చూపిస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఏ బ్యానర్ పై తెరకెక్కుతుందనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ బ్యానర్లు అన్నీ బాలయ్య హీరోగా సినిమాలను నిర్మించడానికి సిద్ధమవుతున్నాయి.

బాలయ్య (Balayya) పారితోషికం ప్రస్తుతం 20 నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. బాలయ్య సినిమాలకు ఏకంగా 100 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని సమాచారం అందుతోంది. బాలయ్య మాస్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీకి సంబంధించి అప్ డేట్ వచ్చినా ఈ సినిమా నవంబర్ తర్వాతే సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.

2024 ఎన్నికలకు ముందు ఈ సినిమాను రిలీజ్ చేయడం సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఈ సినిమాలు రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ కాంబినేషన్ పై ఇతర భాషల ప్రేక్షకుల్లో సైతం మంచి అంచనాలు ఉన్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus