Dil Raju: ఎప్పుడు అన్నారు.. ఎప్పటికి వస్తోంది… ‘గేమ్‌’ ఛేంజర్‌ సినిమా ఇది!

‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అనే ప్రశ్న ఎంతగా ఇండియన్‌ సినిమాలో వినిపించిందో.. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమా విడుదల ఎప్పుడు?.. అనే మాటను రామ్‌చరణ్‌ (Ram Charan) అభిమానులు అడిగారు. దీనికి సమాధానంగా ఆ మధ్యన ‘క్రిస్మస్‌కి వస్తున్నాం’ అని అనౌన్స్‌ చేసి ఫ్యాన్స్‌ని కూల్‌ చేశారు నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) . అయితే ఇప్పుడు మాట మార్చేసి సంక్రాంతికి వస్తున్నాం అని అనౌన్స్‌ చేశారు. అయితే, ఈ విషయంలో అభిమానుల నుండి వస్తున్న మరో ప్రశ్న.

Dil Raju

‘ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా రాజు గారు?’ అని. ఎందుకంటే ఈ సినిమా విషయంలో గత కొన్ని నెలలుగా రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. సినిమా రీషూట్‌కి వెళ్లిందని, ఆ విషయంలో రామ్‌చరణ్ అంత హ్యాపీగా లేరని, ఇలా ఏవేవో వచ్చాయి. అసలు సినిమాకు గుమ్మడికాయ కొట్టారా అనే డౌట్‌ కూడా క్రియేట్‌ అవుతోంది. ‘గేమ్ చేంజర్’ను తొలుత క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేశాం. అయితే భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్‌ చేయడానికి సంక్రాంతి సీజన్‌ అయితే బాగుంటుందని డిస్ట్రిబ్యూటర్లు చెప్పారు.

అందుకే ‘విశ్వంభర’ (Vishwambhara) టీమ్‌తో మాట్లాడి మేం సంక్రాంతికి వస్తున్నాం అని దిల్‌ రాజు చెప్పారు. అయితే మాట నిలబెట్టుకుని వస్తారా? ఆఖరిలో హ్యాండ్‌ ఇస్తారా అనేది డౌట్‌. ఎందుకంటే చిరంజీవి (Chiranjeevi)  ‘విశ్వంభర’ రెడీగా ఉంది. ఇప్పుడు వస్తామని ‘గేమ్‌ ఛేంజర్‌’ రాకపోతే సంక్రాంతి సీజన్‌ను వదిలేసినట్లు అవుతుంది. కాబట్టి ఇప్పటివరకు సినిమా విషయంలో వేసిన వాయిదాలు ఇకపై వద్దు అనేది ఫ్యాన్స్‌ కోరిక.

ఇదంతా ఓకే కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని టైటిల్‌ పెట్టుకుని సంక్రాంతికి రెడీ అవుతున్నాం అని చెప్పిన వెంకటేశ్‌ (Venkatesh) – అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) సినిమా ఏమైనట్లు? ఎందుకంటే సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది సంక్రాంతికి పక్కా అని మొన్నీమధ్య కూడా అనిల్‌ రావిపూడి చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే ఆ సినిమా నిర్మాత దిల్‌ రాజు ‘గేమ్‌ ఛేంజర్‌’ని సంక్రాంతికి తీసుకొస్తారు.

జక్కన్నా.. మహేష్‌ సినిమా కథ రాస్తున్నారా? మారుస్తున్నారా? ఏమవుతోంది?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus