Dil Raju: ‘ఎఫ్4’ విషయంలో దిల్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?

టాలీవుడ్ లో కొన్నేళ్లక్రితం వచ్చిన ‘ఎఫ్2’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో దానికి కొనసాగింపుగా ‘ఎఫ్3’ సినిమాను రూపొందించారు నిర్మాత దిల్ రాజు. ‘ఎఫ్3’ కూడా బాక్సాఫీస్ దగ్గర స్టడీగానే ఉంది. ఈ సినిమా విడుదలకు ముందే ‘ఎఫ్4’ ఉంటుందని దిల్ రాజు ప్రకటించారు. సినిమాలో ఎండ్ కార్డ్స్ లో ఆ విషయంప్రకటించారు . అయితే ఇప్పుడు ఆ సినిమా చేసే ధైర్యం దిల్ రాజు చేస్తారా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.

‘ఎఫ్3’ సినిమా ప్రారంభంలో దిల్ రాజు చాలా ఇబ్బందులు పడ్డారు. ‘ఎఫ్2’ సినిమాకి ఇచ్చిన రెమ్యునరేషన్ డబుల్ చేస్తేనే గానీ ‘ఎఫ్3’లో నటించడానికి హీరోలు అంగీకరించలేదని సమాచారం. పైగా సినిమాలో క్యాస్టింగ్ ఓ రేంజ్ లో ఉంది. వర్కింగ్ డేస్ కూడా చాలా ఎక్కువ. కేవలం రెమ్యునరేషన్స్ కోసం రూ.35 నుంచి 40 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. సినిమా నిర్మాణం మొత్తానికి రూ.75 కోట్లు ఖర్చు పెట్టారట.

ఇక ‘ఎఫ్4’ తీయాలంటే అంతకుమించే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈసారి మరో హీరోని కూడా తీసుకుంటామని చెప్పారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ లెక్కన చూసుకుంటే బడ్జెట్ పెరిగిపోతూనే ఉంటుంది. ఇప్పటికే ‘ఎఫ్3’ సినిమాపై కొన్ని చోట్ల నెగెటివ్ టాక్ వస్తుంది. ‘ఎఫ్2’ రేంజ్ లో లేదని పెదవి విరుస్తున్నారు. కాబట్టి ఈసారి అద్భుతమైన కథ, హీరోలు రెమ్యునరేషన్ గురించి పట్టుపట్టకుండా ఉంటే మాత్రమే ‘ఎఫ్4’ విషయంలో దిల్ రాజు ఓ నిర్ణయం తీసుకునే ధైర్యం చేస్తారు.

కానీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో ఇప్పుడే చెప్పలేం. ఓ పక్క దిల్ రాజు వరుస ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు. ఇక అనిల్ రావిపూడి లిస్ట్ లో బాలయ్య, మహేష్ బాబుల సినిమాలు ఉన్నాయి. అవన్నీ పూర్తయితే కానీ ‘ఎఫ్4’పై క్లారిటీ రాదు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus