Pawan Kalyan, Rana: ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్.. సెట్లో త్రివిక్రమ్ డామినేషన్..!

‘మీ హీరోకి ఏ కుర్చీ వేస్తే.. నాకు అదే కుర్చీ వేయాలి’ అంటూ ‘దూకుడు’ సినిమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు ఈ డైలాగ్ కు తగ్గ సిట్యుయేషన్ పవన్- రానా ల మల్టీస్టారర్ సినిమా సెట్లో కనిపిస్తోందని వినికిడి. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రం రీమేక్ గా ఈ మల్టీస్టారర్ తెరకెక్కుతుంది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

‘అయ్యారే’ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన సాగర్ చంద్ర దీనికి దర్శకుడు. అలాగే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ చిత్రానికి రైటర్ గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సెట్లో దర్శకుడు సాగర్ కంటే.. త్రివిక్రమ్ హడావిడే ఎక్కువగా కనిపిస్తుందని ఇండస్ట్రీ టాక్. పవన్ కళ్యాణ్ ఉండగా మరో హీరో రానాని ఎలా జనాలు కాన్సన్ట్రేట్ చేయరో సరిగ్గా.. ఇలాగే త్రివిక్రమ్ ఉండగా.. దర్శకుడు సాగర్ చంద్రని కూడా సెట్లో పెద్దగా ఎవ్వరూ కేర్ చేయడం లేదని.. కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

పవన్ కు సీన్ గురించి వివరించేటప్పుడు కచ్చితంగా త్రివిక్రమ్ కూడా ఉండాలని పవన్ చెప్పారట. ఈ నేపథ్యంలో ఈ రీమేక్ త్రివిక్రమ్ మార్క్ తో బయటకి వస్తుందాలేదా లేక సాగర్ చంద్ర మార్క్ తో బయటకి వస్తుందా? అనే సందేహాలు నెలకొన్నాయి. ‘సినిమా రిలీజ్ అయ్యాకే హిట్ అయితే త్రివిక్రమ్ అకౌంట్లో.. ప్లాప్ అయితే సాగర్ చంద్ర అకౌంట్లో పడేసే అవకాశాలు కూడా లేకపోలేదని’ టాక్ వినిపిస్తుంది. అంటే దర్శకుడికి క్రెడిబిలిటీ లేనట్టే అని వీరి కామెంట్లను బట్టి స్పష్టమవుతుంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus