బిగ్‌బాస్‌ 4: వారం నుంచి గంగవ్వ ఆరోగ్యం బాగోకపోతే ఎందుకు చూపించలేదు?

బిగ్ బాస్ ఇంటిలోకి గంగవ్వ వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. బయట జనాల మధ్య తిరిగిన మనిషి ఇంట్లో ఎలా ఉంటుందా అని కొందరు అనుకుంటే… గంగవ్వ కి ఏదన్నా సాధ్యమే అంటూ ఇంకొందరు అనుకున్నారు. అయితే గంగవ్వ తొలి వారంలోనే ఆదరగొట్టేసింది. చాలా ఆక్టివ్ గా ఉంటూ కుర్రాళ్ళ కు పోటీగా నిలిచింది. అయితే తరవాత తరవాత ఆమె లో ఆ జోరు కనిపించలేదు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యంపాలు అవ్వడంతో బయటకు వచేస్తా అంటూ ఏడ్చేసింది. కానీ మందులు వేసుకొని మళ్ళీ సెట్ రైట్ అయింది. ఇప్పుడు మళ్ళీ గంగవ్వ వెళ్లిపోతా అంటోంది.

ఇంట్లో ఇంకొన్నాళ్ళు ఉందాం అనుకుంటున్నా… అయితే శరీరం సహకరించడం లేదు అంటూ ఈ రోజు కాన్ఫెసన్ రూమ్ లో ఏడ్చేసింది గంగవ్వ. నాగార్జున కూడా గంగవ్వ హెల్త్ రిపోర్ట్ చూసి… అదే మాట చెప్పాడు. గంగవ్వ ఆరోగ్యం బాలేదు… ఇంటికి వెళ్లిపోతా అంటోంది అంటూ చిన్న హింట్ ఇచ్చాడు. అంతే కాదు… మీరు ఒక అంటే పంపించేద్దాం అంటూ బిగ్ బాస్ ని అడిగాడు. మీరు పర్మిషన్ ఇస్తే గంగవ్వ వెళ్ళిపోతారు అని అన్నాడు. మరి బిగ్ బాస్ ఏమన్నాడో ఈ రోజు రాత్రి తెలుస్తుంది.

అంతా బాగుంది కానీ గంగవ్వ కి ఆరోగ్యం బాగాలేదని… ఆందోలోనూ ఆమె ఇంటికి వెళ్లిపోతా అనేంతగా ఆరోగ్యం బాగాలేదని ఎందుకు ఈ వారం మొత్తం చూపించలేదు. ఆమె వెళ్లిపోతా అని ఏడిస్తే కానీ చుపించరా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీకెండ్ లో నాగార్జున వస్తే కానీ విషయం చెప్పకూడదని ఏమన్నా ఉందా. ఏమో మరి ఈ రోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus