Geetu: 9వ వారం ఎలిమినేషన్స్ లో ఏం జరిగింది..? సీక్రెట్ రూమ్ లో ఉన్నది ఎవరంటే.?

బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం ఎలిమినేషన్స్ లో హై డ్రామా నడిచింది. నిజానికి శ్రీసత్య, ఫైమా, ఆదిరెడ్డి, రోహిత్ ఈ నలుగురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతారని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా గీతుని ఎలిమినేట్ చేశారు. అన్ అఫీషియల్ ఓటింగ్ సైట్స్ ప్రకారం, లెక్కల ప్రకారం అయితే గీతు రాయల్ డేంజర్ జోన్ లోనే ఉంది. గతవారం కంటే కూడా ఓటింగ్ లో బాగా వెనకబడింది. దీంతో 10మంది నామినేషన్స్ లో ఉన్నా కూడా ఓటింగ్ ని పెంచుకోలేకపోయింది.

ముఖ్యంగా గతవారం, ఈవారం గీతు ఆడిన గేమ్, హోస్ట్ నాగార్జున పీకిన క్లాస్ గీతుకి మైనస్ అయ్యాయి. అంతేకాదు, హౌస్ లో ఇనయ ఈవారం ఎలిమినేట్ అయిపోతుందని జోస్యం చెప్తూ శ్రీసత్యతో బెట్ కూడా కట్టింది గీతు. కానీ, తానే వెళ్లిపోతానని ఊహించలేకపోయింది. గీతు ఎలిమినేషన్ విషయంలో నెటిజన్స్, అలాగే బిగ్ బాస్ లవర్స్ అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇన్ని వారాలుగా భరిస్తున్నామని, అసలు గీతుని ఫస్ట్ వీక్ పంపించేయాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, గీతు ఎలిమినేట్ అయ్యిందనే సోషల్ మీడియాలో న్యూస్ ని తెగ షేర్లు చేస్తూ ఆనందపడిపోతున్నారు.

మరికొంత మంది అయితే టపాసులు పేలుస్తూ వారి ఆనందాన్ని వీడియోలు తీసి షేర్లు చేస్తున్నారు. బిగ్ బాస్ రివ్యూవర్ గా హౌస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది గీతు రాయల్. వచ్చిన రోజే నేను అన్ ఫెయిర్ గేమ్ ఆడతా అంటూ చెప్పి మరీ గేమ్ ఆడింది. నిజాయితీకంటే కూడా నేను ఎలాగైనా సరే గేమ్ గెలవడం కోసమే ఆడతాను అంటూ సవాళ్లు విసిరింది. అంతేకాదు , మిగతా కంటెస్టెంట్స్ అందరూ తుప్పాస్ గేమ్ ఆడుతున్నారని, నామినేషన్స్ లో సోది రీజన్స్ చెప్తున్నారంటూ ఎగతాళి చేసింది.

సుదీప, చంటిలతో అయితే ఒక ఆట ఆడుకుంది. దీంతో వాళ్లు గీతుకి నచ్చజెప్పలేక విసిగిపోయారు. ఎలిమినేట్ అయిపోయారు.గీతు గేమ్ చాలా డిఫరెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో స్టార్ట్ చేసింది. నేహా, చంటి, సుదీప, ఆరోహి ఇలా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ కూడా గీతు గేమ్ ని తప్పుబట్టారు. అయినా కూడా తనకున్న ఫాలోయింగ్ తో తొమ్మిది వారాలు బండి నెట్టుకుంటూ వచ్చింది. గీతు అన్న కొన్ని మాటలకి, తను ఆడిన గేమ్స్ కి గీతు..థూ.. తూ.. అంటూ కామెంట్స్ కూడా పెట్టారు.

ఎంతలా తిట్టినా కూడా ఎలా సేవ్ అవుతూ వస్తోందని ప్రేక్షకులు ప్రశ్నించారు కూడా. కానీ, ఎట్టకేలకి బిగ్ బాస్ టీమ్ 9వ వారంలో గీతుని ఎలిమినేట్ చేసింది. దీంతో గీతు గేమ్ చూసి విసిగిపోయిన ఆడియన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. బిగ్ బాస్ లవర్స్ అందరూ , గీతు యాంటీ ఫ్యాన్స్ అందరూ గీతు ఎలిమినేషన్ ని సమర్ధిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక శనివారమే గీతు ఎలిమినేషన్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఆదివారం ఒకర్ని ఫేక్ ఎలిమినేషన్ చేసి సీక్రెట్ రూమ్ లో ఉంచబోతున్నారని సమాచారం. ఈ సీక్రెట్ రూమ్ లో ఇనయ కానీ, లేదా ఆదిరెడ్డి కానీ ఉండే అవకాశం కనిపిస్తోంది. అదీ మేటర్.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus