Jr NTR: ఎన్టీఆర్ లో అంత కెపాసిటీ ఉంది.. కానీ..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న నటుల్లో ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా పోషించే నటనాసామర్థ్యం ఉన్న నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే సంగతి తెలిసిందే. చాలా సందర్భాల్లో దర్శకులు, నిర్మాతలు ఎన్టీఆర్ ప్రతిభ గురించి మాట్లాడుతూ సింగిల్ టేక్ లో కష్టమైన సన్నివేశాల్లో సైతం అద్భుతంగా నటిస్తారని చెప్పుకొచ్చారు. ఒక టాలీవుడ్ డైరెక్టర్ ఎన్టీఆర్ లాంటి నటుడు మళ్లీ పుడతారా..? అంటూ యంగ్ టైగర్ నటనను ప్రశంసించారు. ఎన్టీఆర్ అభిమానులు సైతం చాలా సందర్భాల్లో రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్,

మరి కొందరు దర్శకులు మాత్రమే ఎన్టీఆర్ లోని పూర్తిస్థాయి నటుడిని వాడుకోగలిగారని అభిప్రాయం వ్యక్తం చేస్తారు. అయితే తాజాగా ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ కరుణ రసం ఉన్న పాత్రల్లో ఇప్పటివరకు నటించలేదని ఎన్టీఆర్ లో ఆ పాత్రను అద్భుతంగా పండించగల కెపాసిటీ ఉందని తెలిపారు. ఎవరైతే కరుణ రసం పలికించే పాత్రలో నటిస్తారో వాళ్లు గొప్ప నటులు అని ఎన్టీఆర్ ఆ పాత్రలో నటిస్తే చూడాలని ఉందని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

తాను రాసిన భజరంగీ భాయిజాన్ లాంటి కథలో ఎన్టీఆర్ నటిస్తే బాగుంటుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. మరి భవిష్యత్తులో తారక్ కరుణ రసంను పండించే పాత్రలను ఎంపిక చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో భీమ్ పాత్రలో నటిస్తుండగా ఇప్పటికే రిలీజైన ఆర్ఆర్ఆర్ పోస్టర్లు సినిమాపై అంచనాలను ఊహించని స్థాయిలో పెంచాయి. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus