Jr NTR: ఆ విషయంలో తారక్ మారితే బెటర్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రస్తుతం ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో తారక్ కోరుకున్న పాన్ ఇండియా హీరో ఇమేజ్ దక్కిందనే సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు యాడ్స్ పై ఆసక్తి చూపిస్తుండగా తారక్ మాత్రం యాడ్స్ పై పెద్దగా ఆసక్తి చూపడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. గతంలో తారక్ యాడ్స్ పై ఆసక్తి చూపించినా కొంతకాలం తర్వాత తారక్ యాడ్స్ విషయంలో వెనక్కు తగ్గారు.

తారక్ ఓకే చెబితే ప్రస్తుతం తారక్ పాన్ ఇండియా యాడ్స్ లో కనిపించే అవకాశం ఉంటుంది. మరి తారక్ వీటికి ఎందుకు ఓకే చెప్పడం లేదో క్లారిటీ రావాల్సి ఉంది. కొరటాల శివ డైరెక్షన్ లో తారక్ హీరోగా నటించాల్సిన సినిమా అంతకంతకూ ఆలస్యం అవుతోంది. తారక్ కనీసం యాడ్స్ లో కనిపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. యాడ్స్ విషయంలో తారక్ మారాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

తారక్ కొరటాల కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో మొదలుకానుంది. స్క్రిప్ట్ పనులను పూర్తి చేసి కొరటాల శివ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. కేవలం 6 నుంచి 7 నెలలలో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆచార్య విషయంలో జరిగిన తప్పు ఈ సినిమా విషయంలో జరగకుండా కొరటాల శివ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అటు ఎన్టీఆర్ ఇటు కొరటాల శివ ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చేలా కొరటాల శివ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమాసినిమాకు జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ పెరుగుతుండగా తర్వాత ప్రాజెక్ట్ లతో జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్లను సాధించాలని ఫ్యాన్స్ భావిసున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus