Jr NTR: డైరెక్టర్ అట్లీతో సినిమా గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇదే!

  • September 19, 2024 / 08:52 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  కోలీవుడ్ డైరెక్టర్లతో సినిమా చేయాలని ఆశ పడుతున్నారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వెట్రిమారన్ తో (Vetrimaaran) సినిమా చేయాలని ఉందని రెండు రోజుల క్రితం చెప్పిన తారక్ తాజాగా అట్లీతో సినిమా చేయాలని ఉందని కామెంట్లు చేశారు. దర్శకుడు అట్లీ (Atlee Kumar) తనకు ఒక స్టోరీ లైన్ చెప్పాడని తారక్ పేర్కొన్నారు. అట్లీ టాలెంటెడ్ డైరెక్టర్ అని తారక్ అన్నారు. అట్లీ నాకు ఒక రొమాంటిక్ కామెడీ స్టోరీ లైన్ చెప్పారని తారక్ తెలిపారు.

Jr NTR

ఆ స్టోరీ లైన్ గురించి మా ఇద్దరి మధ్య చర్చ జరిగిందని నేను, అట్లీ కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు. భవిష్యత్తులో అట్లీ డైరెక్షన్ లో కచ్చితంగా నటిస్తానని తారక్ వెల్లడించారు. అట్లీ రాజారాణి (Raja Rani) సినిమాను తెరకెక్కించిన విధానం నాకు ఎంతగానో నచ్చిందని తారక్ పేర్కొన్నారు. అట్లీతో కచ్చితంగా సినిమా చేస్తానని తారక్ క్లారిటీ ఇచ్చేశారు.

లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) పనితనం అంటే ఎంతో ఇష్టమని, నెల్సర్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) జైలర్ లో (Jailer) రజనీకాంత్ ను (Rajinikanth) కొత్తగా చూపించారని తారక్ పేర్కొన్నారు. మరోవైపు దేవర సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదలవుతుందా? లేదా? అనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది. దేవర (Devara). మూవీ విస్మరణకు గురైన తీర ప్రాంతానికి సంబంధించిన కథతో తెరకెక్కుతోంది. దేవర మూవీ నిడివి 2 గంటల 42 నిమిషాలు అని టైటిల్స్ ఈ నిడివికి అదనం అని సమాచారం.

మరీ ఎక్కువ నిడివి వల్ల నష్టమని భావించి మేకర్స్ జాగ్రత్త పడ్డారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటారో అని ఇండస్ట్రీ వర్గాలు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఎన్టీఆర్ అభిమానులకు నచ్చితే మాత్రం దేవర ఫ్యాన్స్ అంచనాలను మించి సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంటుంది.

అల్లు అరవింద్ దృష్టిలో స్టార్ ‘హీరో’ ఎవరు అంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus