మొన్నటికి మొన్న టాలీవుడ్ దిగ్గజ రైటర్ అయినటువంటి పరుచూరి వెంకటేశ్వరరావు (Paruchuri Venkateswara Rao).. ఓ సినిమా కథ గురించి.. స్క్రీన్ ప్లే గురించి ఓ డెఫినిషన్ చెప్పి హాట్ టాపిక్ అయ్యారు. చిరంజీవి (Chiranjeevi) ‘ఖైదీ’ (Khaidi) సినిమా రిఫరెన్స్ తీసుకుని.. ‘పగ కోసమే ఈ జన్మ ఎత్తాను.. ప్రేమ కోసం ఇంకో జన్మ ఎత్తుతాను’ అని ఓ డైలాగ్ ఉంటుంది. ‘ఖైదీ’ కథ గురించి చెప్పాలంటే ఆ లైనే కథ. అయితే స్క్రీన్ ప్లే గురించి చెప్పమంటే.. మిగిలిన సినిమా. ‘ప్రేక్షకులు ఊహించిందే సినిమాలో జరగాలి.. కానీ ప్రేక్షకులు ఊహించినప్పుడు జరగకూడదు’..
ఇదే స్క్రీన్ ప్లే అంటూ ఆయన అనుభవంతో చాలా గొప్పగా చెప్పారు పరుచూరి వెంకటేశ్వరరావు. ఇప్పుడు అల్లు అరవింద్ కూడా స్టార్ హీరోకి డెఫినిషన్ చెప్పి హాట్ టాపిక్ అయ్యారు. అల్లు అరవింద్ (Allu Aravind) మాట్లాడుతూ.. ‘నా దృష్టిలో (స్టార్) హీరో డెఫినిషన్ ఏంటంటే.. ‘ఓ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చినా దానికి మినిమమ్ కలెక్షన్స్ పెట్టేవాడే హీరో. ఒకవేళ వేరే ఆర్డినరీ హీరో కనుక సినిమా చేసి.. అది ఫ్లాపయితే ఆ నెక్స్ట్ షోల నుండే బుకింగ్స్ ఉండవు, తర్వాత ఇంకా డౌన్ అయిపోతాయి’ అంటూ అల్లు అరవింద్ తెలిపారు.
నిజానికి ఇది కొత్త విషయం ఏమీ కాదు. కానీ అల్లు అరవింద్ ఏ స్టార్ హీరోని దృష్టిలో పెట్టుకుని ఈ కామెంట్స్ చేశారు? అనేది నెటిజన్లు చెక్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వంటి హీరో సినిమా ఫ్లాపైనా వీకెండ్ వరకు కలెక్షన్స్ వస్తాయి. టాలీవుడ్లో ఆ స్థాయి క్రేజ్ ఉన్న హీరో అతనే. ఇప్పుడంటే ప్రభాస్ వచ్చినా, గతంలో అయితే ఇలాంటి గౌరవం పవన్ ప్లాపు సినిమాలకి దక్కేవి. అయితే అల్లు అర్జున్ (Allu Arjun).. విషయంలో ఇలాంటివి ఆశించలేం. ‘నా పేరు సూర్య..’ (Naa Peru Surya, Naa Illu India) సినిమాకి ప్లాప్ టాక్ వస్తే నెక్స్ట్ షో నుండే జనాలు లేరు.
సో అల్లు అరవింద్ దృష్టిలో అసలైన హీరో అంటే పవన్ కళ్యాణే అనుకోవాలా? ఈ మధ్య మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి కొంత గ్యాప్ ఏర్పడింది. ఇలాంటి టైంలో కూడా అల్లు అరవింద్ తన కొడుకుని పక్కనపెట్టి పవన్ కళ్యాణ్..ని ప్రశంసిస్తారా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. కానీ సక్సెస్-ఫుల్ ప్రొడ్యూసర్ కాబట్టి.. ఆయన అభిప్రాయం నిజాయితీగానే ఉంటుంది అనడంలో సందేహం లేదు. పవన్ బాక్సాఫీస్ స్టామినా గురించి కూడా ఆయనకు బాగా తెలుసు.