Jr NTR: నిరుత్సాహంలో తారక్ ఫ్యాన్స్.. కారణాలివే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాసినిమాకు గ్యాప్ రాకుండా జాగ్రత్త పడే హీరోలలో ఎన్టీఆర్ ఒకరనే సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ ఎక్కువ డేట్స్ కేటాయించడంతో ఎన్టీఆర్ కెరీర్ లో తొలిసారి లాంగ్ గ్యాప్ వచ్చింది. 2018 సంవత్సరం అక్టోబర్ నెల 11వ తేదీన ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా విడుదల కాగా ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది. 2001 సంవత్సరంలో నిన్ను చూడాలని సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన ఎన్టీఆర్ కు 2009 సంవత్సరంలో మాత్రమే గ్యాప్ వచ్చింది.

2009 లో ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయితే 2010 సంవత్సరంలో అదుర్స్, బృందావనం సినిమాలను రిలీజ్ చేసి ఆ రెండు సినిమాలతోనూ ఎన్టీఆర్ విజయాలను సొంతం చేసుకున్నారు. ఆ తరువాత మళ్లీ ఇన్నేళ్లకు ఎన్టీఆర్ కెరీర్ లో గ్యాప్ వచ్చింది. మరోవైపు రామ్ చరణ్ మాత్రం 2019లో వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మే 13వ తేదీన ఆచార్యతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

మరోవైపు ఎన్టీఆర్ “ఎవరు మీలో కోటీశ్వరులు” షో కూడా వాయిదా పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కావడానికి చాలా సమయం ఉండటం, ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు వస్తున్న వార్తల వల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు మరికొన్ని నెలల సమయం ఉండటంతో ఎన్టీఆర్ ఈ గ్యాప్ లో వాణిజ్య ప్రకటనలలో నటించి బుల్లితెరపై సందడి చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫ్యాన్స్ కోరికను ఎన్టీఆర్ నెరవేరుస్తారో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus