ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేలా కాకుండా నటన విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. కొన్ని సన్నివేశాల్లో చరణ్ అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పిస్తే మరికొన్ని సన్నివేశాల్లో తారక్ తన నటనతో ప్రేక్షకులు ఫిదా అయ్యేలా చేశారు. మూడో రోజు కూడా ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించింది.
నైజాం ఏరియాలో ఈ సినిమా కలెక్షన్లు 50 కోట్ల రుపాయల మార్కును దాటాయి. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా అంచనాలను మించి కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం. మూడు రోజుల్లోనే 55 శాతం రికవరీ కావడంతో ఫస్ట్ వీక్ సమయానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ద్వారా చరణ్ లేదా ఎన్టీఆర్ కు నేషనల్ అవార్డ్ దక్కే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఈ ఇద్దరు హీరోలలో ఎవరికి అవార్డ్ వచ్చినా తమకు సంతోషమేనని అభిమానులు చెబుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తే తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందని ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంది. చరణ్, ఎన్టీఆర్ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చరణ్ వచ్చేనెలలో ఆచార్య మూవీతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఎన్టీఆర్, చరణ్ భవిష్యత్తు ప్రాజెక్టులు భారీ బడ్జెట్ సినిమాలుగా తెరకెక్కనున్నాయి.ఈ సినిమాలతో ఈ ఇద్దరు హీరోలు తమ మార్కెట్ ను మరింత పెంచుకుంటారేమో చూడాల్సి ఉంది. సినిమాసినిమాకు ఈ ఇద్దరు హీరోలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో ఈ ఇద్దరు హీరోల రెమ్యునరేషన్ కూడా పెరిగిందని ప్రచారం జరుగుతోంది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?