పెళ్ళైన తరువాత కాజల్ కెరీర్ ముగిసినట్టేనట..!

ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా సరే.. పెళ్ళైన తరువాత ఆ స్టార్ డం ను కొనసాగించడం కష్టమే. అలా అని అసాధ్యమని మాత్రం చెప్పలేము. సావిత్రి,శ్రియ,సమంత, కరీనా కపూర్, రాధికా ఆప్టే, శకుంతలా దేవి వంటి హీరోయిన్లు పెళ్ళైన తరువాత కూడా స్టార్ డం ను కొనసాగించారు. ఈ డిస్కషన్ అంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? మన కాజల్ గురించేనండీ..! ఈ మధ్యనే బిజినెస్మెన్ గౌతమ్ కిచ్లుని పెళ్లాడబోతున్నట్టు ప్రకటించింది కాజల్. దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా కాస్త నిరుత్సాహ పడ్డారనే చెప్పాలి.

అది పక్కన పెట్టేసినా.. పెళ్ళైన తరువాత కాజల్ సినిమాల్లో నటిస్తుందా? లేదా? ఎప్పటిలాగా స్టార్ హీరోయిన్ లానే రాణిస్తుందా? లేదా? అంటూ వారు సోషల్ మీడియాలో తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. పెళ్ళైన తరువాత సమంత తన స్టార్ డం ను పెంచుకుంది. అలాగే కాజల్ కూడా పెళ్ళైన తరువాత రాణిస్తుందా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేము. ఎందుకంటే సమంత .. హీరోనే పెళ్లి చేసుకుంది. పైగా ఆమెకు అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నా.. సమంత కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలను చేస్తుంది. అయితే కాజల్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.

ఆమె బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకోబోతుంది. ఇప్పటి వరకూ బిజినెస్మెన్ ను పెళ్లి చేసుకున్న హీరోయిన్లు చాలా వరకూ సినిమాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకూ గ్లామర్ తోనే కాజల్ నెట్టుకొచ్చింది. ఆమె మంచి నటి అనేలా మంచి సినిమా పడలేదు. ప్రస్తుతం కాజల్ ‘ఆచార్య’ ‘ఇండియన్2′ వంటి పెద్ద చిత్రాల్లో నటిస్తుంది.’మోసగాళ్లు’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అవి పూర్తయ్యాక కాజల్ సినిమాలకు దూరమైనట్టే అనే కామెంట్స్ కూడా బలంగా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..!

Most Recommended Video

కాబోయే భర్తతో కాజల్… వైరల్ అవుతున్న రేర్ ఫోటోస్!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus