2022 సంవత్సరంలో విడుదలైన సినిమాలలో కన్నడ సినిమాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. కేజీఎఫ్ ఛాప్టర్2, ఛార్లీ 777, విక్రాంత్ రోణా, కాంతార సినిమాలు చాలామంది ప్రేక్షకులలో కన్నడ సినిమాలపై ఉన్న అభిప్రాయాన్ని మార్చేశాయి. పరిమిత బడ్జెట్ తో కన్నడ డైరెక్టర్లు వెండితెరపై చేసిన అద్భుతాలు అన్నీఇన్నీ కావు. కన్నడ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమాలను డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేయడానికి టాలీవుడ్ నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.
అయితే 2023 సంవత్సరంలో కూడా కన్నడ సినిమాలు ఇదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తాయా? అనే చర్చ జరుగుతోంది. కన్నడ సినిమాలు వచ్చే ఏడాది కూడా సక్సెస్ సాధిస్తే మాత్రం మరి కొన్నేళ్ల పాటు శాండిల్ వుడ్ సినిమాల హవా కొనసాగుతుంది. టాలీవుడ్, శాండిల్ వుడ్ సినిమాల విజయాల వల్ల ఇతర ఇండస్ట్రీలలో కూడా ఈ సినిమాల గురించి చర్చ జరుగుతుండటం గమనార్హం. 2023 సంవత్సరంలో కూడా కన్నడ సినిమాలు భారీ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
కేజీఎఫ్ ఛాప్టర్3, కాంతార సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కథ, కథనం అద్భుతంగా ఉంటే ఈ సినిమాలు సక్సెస్ సాధించడం కూడా కష్టమేమీ కాదు. మరోవైపు టాలీవుడ్ లో పలు సినిమాలు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలు కూడా భారీ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2023 సంవత్సరం సౌత్ సినిమాలకు మరింత కలిసిరావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ప్రస్తుతం సౌత్ సినిమాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. సౌత్ సినిమాల హిందీ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవుతున్నాయి. సౌత్ సినిమాలలో వచ్చే ఏడాది రిలీజవుతున్న చాలా సినిమాలు వేర్వేరుగా 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. సౌత్ సినిమాలకు అంతకంతకూ క్రేజ్ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సైతం తెగ సంతోషిస్తున్న సంగతి తెలిసిందే.
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!