Kantara 2: ‘కాంతార చాప్టర్ 1’… ఆ విషయంలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రికార్డు..!

ఈ రోజుల్లో అనౌన్స్ చేసిన డేట్ కి సినిమా రిలీజ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. పైగా పాన్ ఇండియా సినిమాల విషయంలో ఇది వర్కౌట్ అవ్వడం కూడా కష్టమనే అభిప్రాయాలు ఎప్పటికప్పుడు వ్యక్తమవుతూనే ఉంటాయి. పాన్ ఇండియా సినిమాలు అనే కాదు పెద్ద హీరోల సినిమాలు ఏవైనా సరే అనౌన్స్ చేసిన డేట్లకి రావడం లేదు. చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Nandamuri Balakrishna), వెంకటేష్(Venkatesh), నాగార్జున(Nagarjuna) వంటి సీనియర్ స్టార్ హీరోల సినిమాల విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది.

Kantara 2

చిరంజీవి ‘విశ్వంభర'(Vishwambhara) సినిమానే తీసుకోండి.. అది ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి 3 ఏళ్ళు దాటింది. ఇంకా రిలీజ్ కాలేదు. అంతెందుకు ‘జై హనుమాన్’ సినిమాని ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ చేస్తాను అని ప్రకటించారు. ఆ సినిమా షూటింగ్ కూడా జరగడం లేదు. అయితే ఇప్పుడు ఓ పాన్ ఇండియా సినిమా..

కరెక్ట్ గా మేకర్స్ అనౌన్స్ చేసిన డేట్ కే వచ్చేస్తుందని తెలుస్తుంది. అది మరేదో కాదు ‘కాంతార చాప్టర్ 1’. 2022 వ సంవత్సరంలో కన్నడంలో చాలా సైలెంట్ గా రిలీజ్ అయ్యింది ఈ సినిమా. అక్కడ సెప్టెంబర్ 30న రిలీజ్ అయితే.. 2 వారాల తర్వాత హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ చేశారు. అయినప్పటికీ ఈ సినిమా అన్ని చోట్లా కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. కనీసం ఈ సినిమాకి ప్రమోషన్స్ వంటివి కూడా సరిగ్గా చేయలేదు.

మౌత్ టాక్ తోనే ఘన విజయం సాధించింది. అందుకే దీని సీక్వెల్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. మొదట ‘కాంతార 2’ గా అనౌన్స్ చేసినా తర్వాత ‘కాంతార చాప్టర్ 1’ పేరుతో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఇది. ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో రూ.300 కోట్లకు పైనే కలెక్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

మరో వివాదంలో ‘భైరవం’.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus