KGF2, RRR: కేజీఎఫ్2 మూవీ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందా?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల్లోనే ఈ సినిమాకు 500 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏరియాలలో ఈ సినిమాకు టికెట్ రేట్లు తగ్గించారని సమాచారం అందుతోంది. టికెట్ రేట్లు తగ్గడంతో ఈ సినిమాను చూసే ప్రేక్షకుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

Click Here To Watch NOW

ఫుల్ రన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్, చరణ్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచింది. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ క్రియేట్ చేసిన రికార్డులను కేజీఎఫ్2 బ్రేక్ చేయవచ్చని కొంతమంది భావిస్తుండగా మరి కొందరు మాత్రం ఆర్ఆర్ఆర్ మూవీ క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేయడం సులువు కాదని కామెంట్లు చేస్తున్నారు. తాజాగా కేజీఎఫ్2 ట్రైలర్ రిలీజ్ కాగా ఈ ట్రైలర్ గురించి ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కేజీఎఫ్2 ట్రైలర్ లో కథ కంటే అదనపు హంగులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. యశ్ కు కూడా ట్రైలర్ లో సరైన ప్రాధాన్యత దక్కలేదని మరి కొందరు చెబుతున్నారు. కేజీఎఫ్2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి. ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. కేజీఎఫ్ ఛాప్టర్1 లో లేని ఎన్నో పాత్రలు ఛాప్టర్2 లో ఉన్నాయి.

అయితే ఆ పాత్రలు సినిమాకు ప్లస్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది. తెలుగులో గుర్తింపును సంపాదించుకున్న నటులకు కేజీఎఫ్ ఛాప్టర్2 లో ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ప్రశాంత్ నీల్ కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ ఎంతో కీలకమని చెప్పవచ్చు. ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ప్రాజెక్టులలో టాలీవుడ్ స్టార్స్ హీరోలుగా నటిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus