Mahesh, Rajamouli: ప్రభాస్ సినిమా స్టైల్లోనే మహేష్- రాజమౌళి సినిమా మొదలవుతుందా?

‘ఆర్.ఆర్.ఆర్’ (RRR)  తర్వాత రాజమౌళి (S. S. Rajamouli) , ‘గుంటూరు కారం’  (Guntur Kaaram) తర్వాత మహేష్ బాబు (Mahesh Babu)..ల నుండి ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీగా రూపొందనుంది ఈ ప్రాజెక్టు. ఈ సినిమాలో మహేష్ నెవర్ బిఫోర్ అనే లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు గుబురు గడ్డంతో కనిపించబోతున్నాడు.ఇప్పటికే అతని ఫోటోలు చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఫైనల్ గా ఏ లుక్ సెట్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది. మరోపక్క ఈ సినిమా కోసం మహేష్ బాబు వర్క్ షాప్స్ లో పాల్గొంటున్నాడు.

Mahesh, Rajamouli:

అలాగే యూనిట్ డైరెక్టర్ కార్తికేయ సౌత్ ఆఫ్రికా మొత్తం రెక్కీ చేస్తూ లొకేషన్స్ ఫైనల్ చేస్తున్నాడు. ఇక రాజమౌళి నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఇండోనేషియాకు చెందిన ఓ హీరోయిన్ తో ఫోటో షూట్ చేసినట్టు వినికిడి. ఇదిలా ఉండగా.. ఈ సినిమా కథ మొత్తం సౌత్ ఆఫ్రికా నేపథ్యంలో సాగుతుంది. కాకపోతే ఫస్ట్ షెడ్యూల్ వారణాసి బ్యాక్ డ్రాప్లో ఉంటుందట. మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా ఇది. కాబట్టి.. ఫస్ట్ షెడ్యూల్ వారణాసి బ్యాక్ డ్రాప్లోనే స్టార్ట్ అవ్వాలి.

అలా అని వారణాసిలో షూటింగ్ జరుపుతారు అని కాదు. హైదరాబాద్ శివార్లలో వారణాసి సెట్ వేసి.. ఫస్ట్ షెడ్యూల్ అక్కడ ఫినిష్ చేస్తారట. ప్రభాస్ (Prabhas) , నాగ్ అశ్విన్ (Nag Ashwin) ..ల ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) కి కూడా ఇలానే చేశారు. ఇక అటు తర్వాత సౌత్ ఆఫ్రికాలో దట్టమైన అడవుల మధ్య సెకండ్ షెడ్యూల్ నిర్వహిస్తారట. ఫిబ్రవరి నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది అని సమాచారం. జనవరి నెలలో ఫార్మల్ లాంచ్ ఉంటుంది అని తెలుస్తుంది.

‘తుపాకీ’ కి 12 ఏళ్ళు.. తెలుగులో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus