తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) పని ఇక అయిపోయింది, అతను ట్రోల్ మెటీరియల్ అయిపోయాడు అనుకున్న టైంలో ‘తుపాకీ’ (Thuppakki) తో బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆదుకున్నాడు దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ (A.R. Murugadoss). విజయ్ కెరీర్ లో తొలి వంద కోట్ల సినిమా ఇది. ఆ తర్వాత మురుగదాస్ తో ఇతను ‘కత్తి’ (Kaththi) ‘సర్కార్’ (Sarkar) వంటి హిట్ సినిమాలు కూడా చేశాడు. ఇక ‘తుపాకీ’ సినిమా విషయానికి వస్తే.. మిలిటరీ బ్యాక్ డ్రాప్ రూపొందిన ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది.
విజయ్ ని చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు మురుగదాస్. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చాలా థ్రిల్ చేస్తాయి. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 12 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ఫుల్ రన్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం రండి :
నైజాం | 1.45 cr |
సీడెడ్ | 0.40 cr |
ఉత్తరాంధ్ర | 0.52cr |
ఈస్ట్ | 0.22 cr |
వెస్ట్ | 0.20 cr |
గుంటూరు | 0.32 cr |
కృష్ణా | 0.35 cr |
నెల్లూరు | 0.18 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.64 cr |
‘తుపాకీ’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.3.64 కోట్ల షేర్ ను రాబట్టి రూ.0.64 కోట్ల లాభాలతో క్లీన్ హిట్ గా నిలిచింది. విజయ్ కి తెలుగులో మొదటి క్లీన్ హిట్ సినిమా ఇదే.