పూరి లాస్ట్ ట్రయిల్.. మహేష్ ఎలా రియాక్ట్ అవుతాడో..!

‘నాకు హిట్లు లేకపోవడంతో మహేష్ నన్ను పట్టించుకోవడం మానేసాడు’ అంటూ పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రమోషన్ల టైములో కామెంట్ చేసాడు. ‘ఒకవేళ ఇస్మార్ట్ శంకర్’ హిట్ అయితే మహేష్ బాబు ఛాన్స్ ఇస్తాడేమో?’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ‘నాకంటూ ఓ క్యారెక్టర్ ఉంది కదా..? ఎలా ఒప్పుకుంటాను’ అని జవాబు ఇచ్చాడు పూరి. నిజానికి పూరి జగన్నాథ్ ప్లాపుల్లో ఉన్నప్పుడే మహేష్ బాబు.. ‘పోకిరి’ ‘బిజినెస్ మెన్’ సినిమాల ఛాన్స్ ఇచ్చాడు.

ఇది పక్కన పెడితే.. పూరి ఇక మహేష్ తో సినిమా చెయ్యడు అని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇటీవల తన ఇన్స్టా గ్రామ్ ద్వారా ఫ్యాన్స్ తో ముచ్చటించిన మహేష్.. పూరితో సినిమా చెయ్యడానికి నేను ఎప్పుడూ రెడీ. ఆయన మంచి స్క్రిప్ట్ వినిపిస్తే నేను కచ్చితంగా చేస్తాను’ అని చెప్పాడు. ఇక ఈ మధ్యన సోషల్ మీడియాలో లైవ్ లో పాల్గొన్న పూరి.. ‘ఈ రెండు నెలల లాక్ డౌన్ టైములో మహేష్ కోసం ‘జన గణ మన’ స్క్రిప్ట్ లో చేంజెస్ చేశాను.

త్వరలోనే ఆయన్ని కలిసి వినిపిస్తా’ అని చెప్పాడు. మరి పూరి కథను మహేష్ ఓకే చేస్తాడా అన్నది పెద్ద ప్రశ్న. ఎప్పటినుండో ‘జన గణ మన’ సినిమాని మహేష్ తో చెయ్యాలి అని పూరి ప్రయత్నిస్తున్నాడు. ‘అయితే స్క్రిప్ట్ పట్ల సంతృప్తి లేదని.. చేంజెస్ కావాలని’ పూరీని కోరాడట మహేష్. అటు తరువాత కూడా పూరి రెండు మూడు సార్లు మహేష్ ను కలిసి.. ఆయన చేసిన చేంజెస్ గురించి చెప్పాడట. అయినా కూడా మహేష్ కు నచ్చలేదు. దాంతో పూరికి విసుగొచ్చేసినట్టు సమాచారం. మరి ఈసారైనా పూరికి మహేష్ ఛాన్స్ ఇస్తాడా? పూరి లాస్ట్ ట్రయిల్ ఏమవుతుందో చూడాలి..!

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus