Nayanthara: నయనతార డాక్యుమెంటరీ… పెళ్లి అంటే ఓకే.. పెళ్లికి ముందువి కూడా చూపిస్తే…

ఎంతో కష్టపడి, ఎన్నో జాగ్రత్తలు తీసుకొని చేసే సినిమా షూటింగ్‌ల నుండే లీకులు వచ్చేస్తున్నాయి. అలాంటిది ఓ పెళ్లి నుండి ఒక్క వీడియో కూడా రాలేదు అంటే.. ఎంత పకడ్బందీగా ప్లాన్‌ చేసుంటారో ఆలోచించండది. అందులోనూ ఆ పెళ్లి స్టార్‌ హీరోయిన్‌ – స్టార్‌ దర్శకుడిది అయితే. చాలా ప్లాన్‌ చేశారు. అన్నింటికి మించి ఆ వీడియోను అమ్ముకుని బాగానే సంపాదించారు కాబట్టే ఆ వీడియోలు బయటకు రాలేదు. ఇప్పుడు అఫీషియల్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్నాయి.

Nayanthara

అవును, మేం చెబుతున్నది ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ డాక్యమెంటరీ గురించే. నిన్న మొన్నటివరకు ఈ డాక్యుమెంటరీ కేవలం పెళ్లి వరకే పరిమితం అని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు వస్తున్న వివరాల ప్రకారం అయితే ఈ డాక్యుమెంటరీ నయన్‌ (Nayanthara) పెళ్లికి ముందున్న విషయాల గురించి కూడా చర్చ జరగబోతోంది అని అంటున్నారు. నాటి విషయాలను నయన్‌ నోట చెప్పించేదే ఈ వీడియో అని చెబుతున్నారు. దీంతో అన్నీ నిజాలే బయటకు వస్తాయా అనే ప్రశ్న మొదలైంది.

నిజానికి చెప్పాలంటే నయనతార – విఘ్నేష్‌ శివన్‌  (Vignesh Shivan)  పెళ్లి విషయంలోనూ డౌట్స్‌ ఉన్నాయి. మనందరికీ చెప్పిన నాలుగేళ్ల క్రితమే వాళ్ల వివాహం అయిందట. నయన్‌ సరోగసి కోసం జరిగిన లాంగ్‌ డిస్కషన్‌లో ఈ విషయం బయటకు వచ్చింది. మరిప్పుడు వీడియోలో సరోగసి గురించి, ఆ పెళ్లి గురించి ఏమన్నా వివరాలు ఇస్తారేమో చూడాఇల. నయనతార డాక్యుమెంటరీని ఆమె బర్త్ డే సందర్భంగా నవంబర్ 18న స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలియజేసింది.

ఇక ఆమె చెప్పాల్సిన విషయాలు, చెబితే విందాం, చూద్దాం అనుకుంటున్న మరో రెండు విషయాలు.. ఆమె ప్రేమ వ్యవహారాలు. విఘ్నేశ్‌తో పెళ్లికి ముందు నయన్‌కు స్టార్‌ హీరో శింబు, స్టార్‌ కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం నడిచింది. పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయాయి. మరి ఈ విషయాలు ఏమన్నా చర్చకు వస్తాయేమో చూడాలి. వస్తే మాత్రం ఈ డాక్యుమెంటరీ టాక్‌ ఆఫ్‌ ఆది ఇండియా అవుతుంది.

ప్రశాంత్ నీల్ లేకుండానే షూటింగ్ చేస్తున్నారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus