Salaar 2: ప్రశాంత్ నీల్ లేకుండానే షూటింగ్ చేస్తున్నారా?

ప్రభాస్ (Prabhas)  , ప్రశాంత్ నీల్ (Prashanth Neel)  కాంబినేషన్‌లో వచ్చిన ‘సలార్’ (Salaar) బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదలకు ముందే సీక్వెల్ ప్లాన్ చేశారు, కానీ విడుదల తర్వాత సలార్ 2 (Salaar 2) సీక్వెల్ రద్దయిందని కొన్ని వార్తలు వచ్చాయి. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా పలు మీడియా సంస్థలు సలార్ 2 షూటింగ్ మొదలైందని ప్రకటించడంతో అభిమానులు ఖుషీ అయ్యారు. అయితే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ షూటింగ్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ లేకుండానే జరిగినట్లు బాలీవుడ్ మీడియా కథనాల్లో తెలుస్తోంది.

Salaar 2

లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం, సలార్ 2 షూట్‌లో కేవలం చిన్నారులతో కొన్ని సన్నివేశాలను మాత్రమే చిత్రీకరించారట. ప్రశాంత్ నీల్ లేకుండానే ఈ సీన్లు షూట్ చేయడంపై టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ నీల్ తన అసిస్టెంట్స్ కి ఈ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. సలార్ 2 లాంటి భారీ ప్రాజెక్ట్‌కి దర్శకుడు లేకుండా సన్నివేశాలు చిత్రీకరించడం ఆశ్చర్యానికి గురిచేసే విషయం.

ప్రస్తుతం ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్స్ అయిన ‘రాజా సాబ్’  (The Rajasaab) మరియు ‘ఫౌజీ’ షూటింగ్స్ పై ఫోకస్ పెట్టారు. మరోవైపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ (Jr NTR)తో భారీ బడ్జెట్ చిత్రానికి కమిట్ అయ్యారు. దీనితో ఆయన సలార్ 2 షూటింగ్ పై పూర్తిగా ఫోకస్ చేయడం కష్టమైంది. అంతేకాకుండా ప్రశాంత్ తర్వాతి ప్రాజెక్ట్‌గా ‘కేజీఎఫ్ 3’ పై దృష్టి సారించనున్నారు. యశ్ (Yash) కూడా ఇతర ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాతే కేజీఎఫ్ 3 (KGF 3) సెట్స్ లో అడుగుపెట్టనున్నారు.

ఈ నేపథ్యంలో, సలార్ 2 పూర్తి కావడానికి 3 సంవత్సరాలు పట్టవచ్చని అంచనా. హఠాత్తుగా సలార్ 2 షూట్ ఎందుకు చేశారన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. బహుశా ప్రభాస్ కి అందుబాటులో ఉన్నప్పుడు కొన్ని ముఖ్య సన్నివేశాలు ముందుగానే ప్లాన్ చేసినట్లు అనిపిస్తోంది. అభిమానులకి పూర్తి క్లారిటీ రావాలంటే మరికొంత కాలం ఆగాల్సి ఉంటుంది.

పుష్ప 2 క్రేజ్ చూసి కూడా వాళ్ళు భయపడట్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus