Pottel: కమిటీ కుర్రాళ్లు, ఆయ్ కోవలో పొట్టేల్ చేరుతుందా?

2024 తెలుగు సినిమాకి చాలా కీలకమైన సంవత్సరం. హిట్ పర్సంటేజ్ పెరగడమే కాదు, అసాధ్యం అనుకున్న చాలా అంశాలను సుసాధ్యం చేసిన ఏడాది 2024. రాజమౌళి హీరోలకి నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అనే శాపాన్ని కూడా బ్రేక్ చేసిన “దేవర” (Devara) విడుదలైంది 2024లో, తెలుగు సినిమాకి ముచ్చటగా రెండో 1000 కోట్ల సినిమాను యాడ్ చేసింది ఈ ఏడాదే. అలాగే.. “హనుమాన్ (Hanu Man) , టిల్లు స్క్వేర్ (Tillu Square) , సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) , నా సామి రంగ (Naa Saami Ranga) , మత్తు వదలరా2 Mathu Vadalara 2)  , ఓం భీమ్ బుష్ Om Bheem Bush) , కమిటీ కుర్రాళ్లు (Committee Kurrollu)  , ఆయ్ (AAY) ” లాంటి బ్లాక్ బస్టర్స్ అన్నీ ఏడాదిలో రిలీజ్ అయినవే.

Pottel

మరో రెండు నెలల్లో ముగియనున్న 2024లో చిన్న సినిమాలుగా విడుదలై పెద్ద విజయాలు సాధించిన సినిమాలే ఎక్కువ. ఇప్పుడు ఆ కోవలో చేరేందుకు సిద్ధమవుతోంది “పొట్టేల్” అనే చిత్రం. “సవారి” అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యువ చంద్ర, అనన్య నాగళ్ల (Ananya Nagalla) హీరోహీరోయిన్లుగా నటించగా.. అజయ్ (Ajay) & నోయల్ (Noel Sean) కీలకపాత్రలు పోషించారు.

మొదట్లో ఈ సినిమా మీద పెద్ద బజ్ లేకపోయినా, ఇప్పుడు మాత్రం విశేషమైన క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) ప్రీరిలీజ్ ఈవెంట్లో “సినిమా చూసాను, బాగుంది” అని చెప్పడం బాగా ప్లస్ అయ్యింది. కారణాలు ఏవైనా “పొట్టేల్” (Pottel) అన్నిచోట్లా ట్రెండ్ అవుతుంది. ఈమధ్యకాలంలో ఓ చిన్న సినిమాకి ఈస్థాయి ప్రీరిలీజ్ బజ్ ఏర్పడడం ఇదే మొదటిసారి అని చెప్పాలి.

మరి ఈ బజ్ ను సినిమా క్యాష్ చేసుకోలదా? ఈ ఏడాది సూపర్ హిట్స్ గా నిలిచిన “ఆయ్, కమిటీ కుర్రాళ్లు” కోవలో చేరగలదా? అనేది ఇంకో రెండ్రోజుల్లో తెలిసిపోతుంది. ఇకపోతే.. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుండడం కారణంగా థియేటర్ల కొరత కూడా ఉండదు.

సోషల్ మీడియాలో తన భర్తపై సానుభూతి చూపేవాళ్లకి చిన్మయి చురకలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus