జాకీ ష్రాఫ్ సెంటిమెంట్ ని ప్రభాస్ బ్రేక్ చేస్తాడా ?
- August 23, 2017 / 06:09 AM ISTByFilmy Focus
బాలీవుడ్ లోని విలక్షణ నటుల్లో జాకీ ష్రాఫ్ ఒకరు. నెగిటివ్ అయినా, పాజిటివ్ రోల్ అయినా అద్భుతంగా చేస్తారు. హిందీలో మంచి విజయాలను అందుకున్నారు. కానీ తెలుగులో హిట్ అందుకోలేక పోతున్నారు. మంచు విష్ణు హీరోగా నటించిన అస్త్రం తో టాలీవుడ్ లో అడుగు పెట్టారు. ఆ మూవీ సరిగా ఆడలేదు. తర్వాత ఎన్టీఆర్ శక్తి సినిమాలో విలన్ గా నటించారు. ఆ సినిమా అపజయం పాలయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ పంజా కూడా జాకీ ష్రాఫ్ కి హిట్ ఇవ్వలేకపోయింది. దీంతో అతను నటిస్తే ఆ మూవీ ఫ్లాప్ అనే ప్రచారం మొదలయింది. తెలుగు నిర్మాతలు అతన్ని సంప్రదించడం మానేశారు.
తాజాగా ప్రభాస్, సుజీత్ కలయికలో రూపుదిద్దుకుంటున్న సాహో సినిమాలో విలన్ గా తీసుకున్నారు. రామోజీ ఫిలిం సిటీలో 5 కోట్ల బడ్జెట్ తో వేసిన సెట్లో ప్రభాస్, జాకీ ష్రాఫ్ లపై యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్నారు. ఈ విష్యం తెలిసిన ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. జాకీ ష్రాఫ్ అడుగుపెడితే ఆ సినిమా ఫెయిల్ అవుతుంది.. ఆ సెంటిమెంట్ సాహో కి కూడా వర్తిస్తుందేమోనని కంగారు పడుతున్నారు. చిత్ర బృందం మాత్రం జాకీ ష్రాఫ్ సెంటిమెంట్ ని ప్రభాస్ బ్రేక్ చేస్తాడని ధీమా వ్యక్తం చేస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















