యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేం రాధా కుమార్ డైరెక్షన్లో ‘రాధే శ్యామ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 25 శాతం పూర్తయ్యింది. ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘గోపికృష్ణ మూవీస్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం కథ ప్రకారం ఎక్కువ శాతం షూటింగ్ పార్ట్ ను యూరప్ లో చిత్రీకరించాల్సి ఉంది. ఇప్పటి వరకూ పూర్తైన షూటింగ్ ను కూడా అక్కడే జరిపారు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విదేశాలకు వెళ్లి షూటింగ్ లు జరిపే అవకశం లేదు.
అందుకే హైదరాబాద్ లో రామోజీ ఫిలింసిటీలోనూ.. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ లోనూ సెట్లు వేసి బ్యాలన్స్ షూటింగ్ ను ఇక్కడే ఫినిష్ చెయ్యాలని.. ‘రాధే శ్యామ్’ దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే ఇక్కడ ఎంత మేనేజ్ చేసినా కొంత భాగం మాత్రం అక్కడ జరపాల్సిన అవసరం ఉందట. అందుకోసం ప్రభాస్ అండ్ టీం యూరప్ వెళ్ళాల్సిందేనని ఇండస్ట్రీ టాక్. ఈ టైములో అక్కడికి వెళ్ళడం అంటే చాలా పెద్ద రిస్క్. అయితే ఆ షెడ్యూల్ ను చివరి షెడ్యూల్ గా పెట్టుకుని..
మిగిలిన షెడ్యూల్స్ ను ఇక్కడే ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. కరోనా వైరస్ ప్రభావం ఇంకా తగ్గని నేపధ్యంలో ‘రాధే శ్యామ్’ షూటింగ్ కూడా ఇంకా మొదలుపెట్టలేదు. సెప్టెంబర్ లో ‘రాధే శ్యామ్’ షూటింగ్ ను మొదలుపెట్టే అవకాశం ఉందని వినికిడి. ముందుగా హాస్పిటల్ లో తెరకెక్కించాల్సిన సన్నివేశాలను తెరకెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం.