‘వకీల్ సాబ్’ టీంకు కొత్త టెన్షన్ వచ్చి పడిందే..!

పవన్ కళ్యాణ్ మాత్రమే యూనిక్ పర్సన్ కాదు.. అతని లాంటి స్వభావం కలిగిన వారు మరికొంతమంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు. ముక్కు సూటిగా వారు అనుకున్నది అనుకున్నట్టు.. ఇంకా చెప్పాలి అంటే ఎదుటివారు ఎలా అనుకుంటారు అనే ఆలోచనే లేకుండా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఈ లిస్ట్ లో ప్రకాష్ రాజ్ కూడా ఒకరని చెప్పొచ్చు. జి.హెచ్‍.ఎం.సి ఎన్నికల నేపథ్యంలో పవన్‍ కళ్యాణ్‍.. బి.జె.పికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాడు.

ఈ విషయం పై పవన్ ను తప్పుపట్టాడు.. నటుడు ప్రకాష్‍రాజ్‍..! అతను ఒక ‘ఊసరవెల్లి’ అన్నట్టు కామెంట్లు చేసాడు. ఈ క్రమంలో పవన్ అభిమానులు అలాగే మెగాబ్రదర్ నాగబాబు.. ప్రకాష్ రాజ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ‘వకీల్ సాబ్’ చిత్రం కోసం పవన్, ప్రకాష్ రాజ్ లు కలిసి పనిచెయ్యాల్సి ఉంది. ఇప్పటికే వీరి కాంబినేషన్లో కొన్ని సీన్లు చిత్రీకరించారు. ఇంకా వీరి కాంబినేషన్లో కొన్ని సీన్లు చిత్రీకరించాల్సి ఉందట.

ఈ నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ యూనిట్ తో పాటు నిర్మాత దిల్ రాజుకి కొత్త టెన్షన్ వచ్చి పడినట్టు తెలుస్తుంది. ‘పవన్, ప్రకాష్ రాజ్ లు.. ఇద్దరూ కూడా ఏ విషయంలోనూ తొందరగా సర్దుకుపోయే మనస్తత్వం కలిగినవారు కాదని.. అవసరమైతే సర్దుకుని వెళ్లిపోయే మనస్తత్వం కలిగిన వారని.. వీళ్ళిద్దరినీ పెట్టి షూటింగ్ జరపడం కష్టమేనని’ .. ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి నిర్మాత దిల్ రాజు ఈ సిట్యుయేషన్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి..!

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus