Prabhas: రాధేశ్యామ్ సినిమాకు హిందీ రిజల్ట్ కీలకమా?

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో 48 గంటల సమయం మాత్రమే ఉంది. ప్రభాస్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఈ స్థాయి బడ్జెట్ తో తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ ఏదీ లేదని సమాచారం అందుతోంది. హీరో ప్రభాస్ రాధేశ్యామ్ ప్రయోగమని ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.

Click Here To Watch Now

రాధేశ్యామ్ సినిమాకు ఏ మాత్రం టాక్ నెగిటివ్ గా వచ్చినా ఈ సినిమా కలెక్షన్లపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు లేకపోవడం అభిమానులను తెగ టెన్షన్ పెడుతోంది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో నార్త్ ఆడియన్స్ కీలక పాత్ర పోషించనున్నారు. 300 కోట్ల రూపాయల బడ్జెట్ రికవరీ కావాలంటే నార్త్ ఇండియా కలెక్షన్లు కీలకమనే సంగతి తెలిసిందే. ప్రభాస్ గత సినిమా సాహో నార్త్ ఇండియాలో హిట్టైంది.

అయితే ఆ సినిమా యాక్షన్ సినిమా కావడంతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నార్త్ ఇండియాలో రాధేశ్యామ్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాధేశ్యామ్ సినిమా హిందీ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో చూడాల్సి ఉంది. హిందీ రిజల్ట్ ఈ సినిమాకు కీలకం కానుంది. బాహుబలి మ్యాజిక్ ను రాధేశ్యామ్ సినిమా రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మాతలకు ఈ సినిమా రిజల్ట్ ఎంతో కీలకమనే సంగతి తెలిసిందే.

ప్రభాస్ గత సినిమా సాహో వల్ల నిర్మాతలు కొంతమేర నష్టపోయారు. ప్రభాస్, పూజా హెగ్డే వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ రాధేశ్యామ్ సినిమాపై అంచనాలను పెంచేశారు. బాక్సాఫీస్ వద్ద రాధేశ్యామ్ రిజల్ట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ పూజా హెగ్డే కెమిస్ట్రీ, క్లైమాక్స్ సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం అందుతోంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus