రాంచరణ్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడా మరో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తయ్యింది. ఇక 2020 జూలై 30 న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ఇదివరకే ప్రెస్ మీట్ పెట్టిమరీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ డేట్ కే సినిమాని విడుదల చేయాలని జక్కన్న విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.
అయితే చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రానికి కూడా చరణ్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో చరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తాడంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు రాజమౌళి చరణ్ కు పర్మిషన్ ఇస్తాడా లేదా అనే విషయం పై చర్చ మొదలవుతుంది. సాధారణంగా రాజమౌళి.. తన హీరోలను ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేవరకూ కట్టిపడేస్తుంటాడు. మిగిలిన నటుల గురించి పెద్దగా పట్టించుకోకపోయినా.. హీరో విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. ‘బాహుబలి’ టైములో రానా, అనుష్క, తమన్నా వంటి వారు మిగిలిన సినిమాలు చేసుకున్నారు. కానీ ప్రభాస్ ను మాత్రం ఆ ఐదేళ్ళు కట్టిపారేసాడు. ఇప్పుడు చరణ్ విషయంలో కూడా అదే రిపీట్ అయినా ఆశ్చర్యపడనక్కర్లేదు.
17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!