Rajamouli: ఆర్ఆర్ఆర్ ఆ తేదీకి రావడం కష్టమేనా?

దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమాకు సంబంధించి వచ్చిన అప్ డేట్స్ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతున్నాయి. ఆర్ఆర్ఆర్ టీజర్లకు, మేకింగ్ వీడియో, దోస్తీ సాంగ్ లకు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ పై ఉన్న అంచనాలు మరే భారతీయ సినిమాపై లేవంటే అతిశయోక్తి కాదు.

అయితే ఈ సినిమాకు సంబంధించి చాలా రూమర్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. దోస్తీ సాంగ్ లో చాలామంది హీరోలు కనిపిస్తారని ప్రచారం జరిగినా ఆ ప్రచారం ఏ మాత్రం నిజం కాలేదు. ఈ సినిమాను కచ్చితంగా అక్టోబర్ 13వ తేదీనే రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే స్పష్టతనిచ్చారు. అయితే ఈ సినిమా ఆ తేదీకి రిలీజ్ కావడం కష్టమేనని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

సినిమా బ్యాలెన్స్ షూట్ పూర్తైనా అక్టోబర్ 13వ తేదీ నాటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావని అందువల్ల ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13వ తేదీన రిలీజ్ కావడం కష్టమని సోషల్ మీడియాలో గాసిప్స్ గుప్పుమన్నాయి. చిత్రయూనిట్ మరోసారి రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేస్తే మాత్రమే ఈ ప్రచారానికి బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ కచ్చితంగా అక్టోబర్ 13వ తేదీనే రిలీజ్ అవుతుందని జక్కన్న పలుమార్లు పోస్టర్లతో స్పష్టం చేస్తున్నా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ప్రేక్షకుల్లో సైతం సందేహాలు నెలకొన్నాయి.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus