‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ డేట్ పై కన్నేసిన మెగా హీరో..!

ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని మొదట జూలై 30న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ ఇంకా ఫినిష్ కాకపోవడం.. వల్ల వాయిదా పడింది. నిజానికి రాజమౌళికి జూలై చాలా కలిసొచ్చిన నెల. ఈ నెలలో విడుదలైన రాజమౌళి సినిమాలు ‘సింహాద్రి’ ‘మగధీర’ ‘ఈగ’ ‘బాహుబలి ది బిగినింగ్’ వంటివి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటి సెంటిమెంట్ తోనే ఎన్టీఆర్, చరణ్ లతో తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ ను కూడా జూలై లో ప్లాన్ చేశాడు. కానీ అన్నీ అనుకున్నట్టు అవ్వవు కదా.. అందులోనూ ఈ సంక్రాంతి కి విడుదలైన సినిమాలు రికార్డు కలెక్షన్లను నమోదు చేసాయి. వాటి ఊపును చూసే జక్కన్న తన సెంటిమెంట్ ని పక్కన పెట్టి… సంక్రాంతి కే ‘ఆర్.ఆర్.ఆర్’ పర్ఫెక్ట్ అని భావించి.. 2021 జనవరి 8కి పోస్టుపోన్ చేసాడు.

Will Rajamouli Sentiment Workout For Varun Tej1

అయితే ఆ ఛాన్స్ ని మిస్ చేసుకోవడం ఎందుకు అని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అనుకుంటున్నాడట. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో తాను నటిస్తున్న చిత్రాన్ని జూలై 30 న విడుదల చెయ్యాలని భావిస్తున్నాడట. ఈ చిత్రంలో వరుణ్.. బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని అల్లు బాబీ నిర్మిస్తున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే ఎలిమెంట్స్ ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటాయని సమాచారం. మరి రాజమౌళి వదులుకున్న ఆ రిలీజ్ డేట్.. వరుణ్ కి కలిసొస్తుందా..? లేదా..? అనేది చూడాలి..!

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus