2006లో పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన విక్రమార్కుడు సినిమా రవితేజ దగ్గరికి వెళ్లింది. మొత్తానికి ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బారి స్థాయిలో విజయాన్ని అందుకొని అప్పట్లో రవితేజ, రాజమౌళి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఆ సినిమాకు మళ్ళీ ఇన్నాళ్లకు రచయిత కె.విజయేంద్ర ప్రసాద్ సీక్వెల్ ప్లాన్ చేయడంతో ఎలా తెరకెక్కుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి ఆ సినిమా చేయడానికి సిద్ధంగా లేడు.
దీంతో మరో మాస్ కమర్షియల్ దర్శకుడు సంపత్ నందికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రాజెక్ట్ లో మళ్ళీ రవితేజ కనిపించకపోవచ్చని టాక్ వస్తోంది. ఎందుకంటే రవితేజ కేజ్డా ఇటీవల బ్యాక్ టూ బ్యాక్ కమిట్మెంట్స్ వలన మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఖిలాడి సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరి రవితేజను కాకుండా ఆ సినిమాలో ఎవరు హీరోగా చేస్తారో చూడాలి.
ఒక విధంగా రవితేజను కాకుండా అలాంటి సినిమాకు మరొకరిని ఊహించుకోవడం కష్టమైన పని. ఇక దర్శకుడు సంపత్ నంది ఏ హీరోను సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి. ఇటీవల ఈ దర్శకుడు సీటీమార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా అనుకున్నంతగా క్లిక్కవ్వలేదు.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!